యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు.. దిమ్మ తిరిగే షాక్ తగిలింది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సేవలు నేటి నుంచి.. భక్తులకు భారం కానున్నాయి. పుణ్యక్షేత్రం లో భక్తులు నిర్వహించే శాశ్వత, నిత్య పూజలతో పాటు, ప్రసాదాల ధరలను పెంచుతూ కార్యనిర్వహణ అధికారి గీత గ ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన ధరలు శుక్రవారం అంటే నేటి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆరేళ్లుగా పూజలు, ప్రసాదాల ధరలు పెంచలేదని.. కరోనా కారణంగా ఆలయ ఆలయం కుంటుపడిందని గీత తెలిపారు. జీతభత్యాల తో ఆర్థికభారం పెరిగిన దృశ్యం స్వామి వారి సేవల ధరలు పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. యాదాద్రి అనుబంధ ఆలయాల్లోనూ పెరిగిన ధరలు వర్తిస్తాయని ఆమె వెల్లడించారు.
పెరిగిన ధరలు
లక్ష్మీ నరసింహ నిత్యకళ్యాణ టికెట్ ధర అ 1250 రూపాయల నుంచి 1500 పెంచింది. సత్యనారాయణ వ్రతం ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలకు, స్వామి వారికి అష్టోత్తరం టికెట్ ధర వంద రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు. వందగ్రాముల లడ్డూ ధర 20 రూపాయల నుంచి 30 రూపాయలకు… 500 గ్రాముల లడ్డూ ధర వంద రూపాయల నుంచి 150 రూపాయలకు… 250 గ్రాములు పులిహోర ప్యాకెట్లు 15 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచింది ఆలయ కమిటీ.