కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, ఆనంద్ రావులు కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. శ్రావ్య వచ్చి బావగారి గురించి ఆలోచిస్తున్నారా.. బావగారికి మనసులో ఏం అనిపించిందో తెలియదు కానీ.. ఇంటి నుంచి వెళ్లిపోతే..పోయిన పరువు ఇంటికి రాదుకదా అత్తయ్య అంటుంది శ్రావ్య. శ్రావ్య మాటలకు షాకై ఆనంద్ రావు , సౌందర్యలు లేచి..ఏం అంటున్నావ్ శ్రావ్య అంటాడు ఆనంద్ రావు. క్షమించాలి మావయ్యగారు నేను మిమ్మల్ని నొప్పించాలని అలా అనలేదు..కానీ లాజిక్ గా ఆలోచిస్తే నిజం అదే కదా..బావగారు వెళ్తూ వెళ్తూ..ఆస్తిని దానం చేసి వెళ్లారంట.. అదేంటి అని అడిగే హక్కు నాకైతే లేదనుకోండి, పరువులు పోయి, ఆస్తులు పోయి..ఇంకా ఏం మిగిలిందని అత్తయ్య మీరు బాధపడటానికి అంటుంది. ఆనంద్ రావు..ఏంటి నువ్వు ఎన్నడూ లేంది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావ్ అంటాడు.
ఇప్పుడు కూడా మాట్లాడకపోతే..నా బతుకు దీపుగాడి బతుకు ఏం అవుతుందోనన్న భయం వేసి మాట్లాడుతున్నాను మావయ్య అంటుంది శ్రావ్య. సౌందర్య కోపంగా..ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నీకు నేర్పించలేదా అంటుంది. నేర్పించింది అత్తయ్య ఇప్పుడైనా మేల్కోని మాట్లాడుతున్నాను…పాపం మా దీపక్క ఈ మాత్రం తెలివితేటలు లేకుండా పోయాయ్ అంటుంది. దీపకు ఏమైందని సౌందర్య అంటే..ఏమైందా..పదకొండేళ్లు ఎడబాటు, మళ్లీ కలిస్తే..మోనిత ఆ బిడ్డ, అసలు దీపక్క నాలుగు ముద్దలు తిని ప్రశాంతంగా పడుకుంది ఎప్పుడు ఉంది ..బావగారు వెళ్లిపోయినంత మాత్రమా..ఏమైనా జరిగిందా..ఆ మోనిత బిడ్డను తీసుకుని వచ్చింది కదా, ఎవరు సంతోషంగా ఉన్నారు..ఎవరూ లేరు అంటుంది .ఇప్పుడేమంటావ్ శ్రావ్య అని సౌందర్య అడుగుతుంది. నేను ఏం అంటాను అత్తయ్య, బావగారు అలా చేసి ఉండాల్సింది కాదు..ఇదే అదునుగా భావించి ఆ మోనిత ఇక్కడే ఉంటానంటే మనం ఏం చేయగలం, ఎటు చూసిన ఆ మోనిత కొడుకు కూడా ఈ ఇంటికి వారసుడే కదా అత్తయ్య అంటుంది. సౌందర్య కోపంగా శ్రావ్య అని అరుస్తుంది. మీకు కోపం వచ్చినా ఇందులో అబద్ధం ఏం లేదు అత్తయ్య, వాళ్లు అలా వెళ్లిపోకుండా ఉంటే..అందరం కలిసి ఉండే వాళ్లం కదా అత్తయ్య, వెళ్లిపోయి బావగారు ఏం సాధించారు అనేసి వెళ్లిపోతుంది
ఇక్కడ దీప పిల్లలు ఇళ్లు క్లీన్ చేస్తుంటారు. దీప ఆ పాతకొంప డోర్ తీసి..కార్తీక్ ను పిలుస్తుంది. అందులో అంతా చెత్త, దుమ్ము ఉంటుంది. కార్తీక్ ఏంటి దీప ఇది అంటే..చాలారోజులుగా ఎవరూ ఉండకపోయే సరికి..దుమ్ము పట్టింది అంతే అంటుంది. పిల్లలు ఛీ ఛీ ఇలాంటి ఇంట్లో మనం ఉండాలా, మనకు అంత పెద్ద ఇళ్లు ఉండగా ఇక్కడ ఎందుకు ఉండాలి అంటారు. దీప మీకు అప్పుడే చెప్పాను ప్రశ్నలు అడగొద్దు అని అంటుంది. హిమకు కోపం వస్తుంది..ప్రశ్నలు అడగొద్దు అంటే అయిపోతుందా..డాడీ అబద్ధాలు చెప్పటం మానేశాడు అనుకున్నా..డాడీ వేస్ట్ అంటుంది. దీప కొట్టడానికి చేయి పైకి ఎత్తి..డాడీని అలా అనొచ్చా అంటుంది. కార్తీక్ హిమ కరెక్టుగానే చెప్పింది..నేను వేస్ట్, ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి కూడా నా దగ్గర ఏం మిగలలేదు అని కార్తీక్ బయటకు వెళ్లబోతాడు.
దీప పిల్లల మీద అరుస్తుంది. ఇది కూడా లేనివాళ్లు ఎంతమంది ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా..అన్నీ మీ వయసుకు అర్థమయ్యేలా చెప్పలేం కదా..మీ నాన్నకు మీరంటే ఇష్టంరా, ప్రాణం తెలుసా..నాన్నను అలా అనొచ్చా, తప్పుకదమ్మా అని.. చెప్పింది అర్థం చేసుకోండి అని బుజ్జగిస్తుంది. పిల్లలు కరిగిపోతారు..శౌర్య..కార్తీక్ కు సారి చెప్తుంది. హిమ కూడా కన్నీళ్లు పెట్టుకుని..సారి చెప్పి..ఇంకెప్పుడు ఇళా మాట్లాడను అమ్మా, మీరెక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటా అంటుంది.
ఇంకోసీన్ లో శ్రావ్య బట్టలు మడతపెట్టుకుంటూ ఉంటుంది. ఆదిత్య చిరాకుగా వచ్చి కుర్చుంటాడు. శ్రావ్య ఏంటి ఆదిత్య అంత చిరాకుగా ఉన్నావా అని అడుగుతుంది. ఆదిత్య…అసలు అన్నయ్య ఎందుకు ఇంట్లోంచి వెళ్లిపోయాడో..అన్నయ్య గురించి ఎవర్ని అడిగినా..అందరూ పరువు తీస్తున్నారు, ఎవరితో వెళ్లిపోయాడు, మీ మోనిత వదినతోనా అంటున్నారు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అంటాడు..ఇదే అదునుగా చూసుకుని మోనిత రెచ్చిపోయేలా ఉంది అంటే..రెచ్చిపోవడమేంటి ఆదిత్య..రేపు బిడ్డను తీసుకువచ్చి ఇక్కడే ఉంటాను అంటే మనం ఏం చేస్తాం చెప్పు ఆదిత్య అంటుంది. ఆదిత్య అక్కడనుంచి వెళ్లిపోతాడు.
మరోపక్క రుద్రాణి ఇంట్రడక్షన్ చూపిస్తారు. ఆవిడ ఏదో లెక్కలు వేయిస్తూ ఉండగా..దీప వస్తుంది. నా పేరు దీప, ఈ ఊరికి కొత్తగా వచ్చాను, మీతో కొంచెం మాట్లాడాలి, టైం బాలేక ఇక్కడకు వచ్చాం అండి..అక్కడున్న కాళీ ఇంట్లో మేం ఉండొచ్చా అంటుంది. రుద్రాణి మీరు ఎంత మంది ఉన్నారు అంటుంది. దీప చెప్తుంది. నాగురించి తెలిసే వచ్చావా అని ఆ రుద్రాణి అడిగితే..మీ ఇల్లు ఎక్కడా అంటే..చాలామంది తలాఓరకంగా చెప్పారు, కానీ చెప్పేవన్నీ నిజాలే కావుకదండి అంటుంది దీప. వాళ్లు చెప్పినవన్నీ నిజాలే..కానీ నువ్వు చెప్పిన మాట నాకు నచ్చింది అంటుంది రుద్రాణి. ఇక్కడే ఏదో ఒక పనిచేసుకుంటూ ఉండిపోతాం, అద్దె ఎంతో చెప్తే అంటుంది దీప. అద్దే ఇస్తావా నాకు, బతకడానికి వచ్చాను అన్నావు, అద్దే ఇచ్చే స్థితిలో ఉన్నావని నేను అనుకోను..లెక్కదేముంది నాకు కావాల్సినప్పుడు నేనే లాక్కుంటాను అంటుంది. అక్కడున్న వాళ్లతో బియ్యం, కూరగాయలు ఇవ్వమంటుంది..దీప వద్దులేండి, మీరు ఉండమన్నారు అదే సంతోషం అని వెళ్లిపోతుంది. ఏంటి అద్దె లేకుండా ఇళ్లు ఇచ్చావా అంటే..నాకు ఆవిడ మాటతీరు, పద్దతి నచ్చిందిరా..నా లెక్కలు నాకు ఉన్నాయి అంటుంది.
ఇక్కడ సౌందర్య కార్తీక్ వాళ్లతో సంతోషంగా ఉన్న జ్ఞాపకాలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. మనవరాళ్లు గుర్తొచ్చి ఏడుస్తుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.
– Triveni Buskarowthu