మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో చెలరేగిన మంటలు ఏకంగా 6 గురిని బలితీసుకున్నాయి. ఈ సంఘటన నిల చోటు చేసుకోగా, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఈ ఆరుగురు సజీవ దహనం కేసులో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
ఆస్తి మరియు సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం భర్త శాంతయ్యను ప్రియుడితో కలిసి భార్య సృజన హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. దీంతో పోలీసులు సృజనతో పాటు మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. ఆహారం లో మత్తుమందు కలిపి, మత్తులో జారుకున్నాక , వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.