బిగ్ అప్డేట్: “మహేష్ బాబు – త్రివిక్రమ్” మూవీ టైటిల్ రివీల్…

టాలీవుడ్ లో వయసు పెరుగుతున్న ఇంకా అందంతో అమ్మాయిలను విపరీతంగా ఆకర్షిస్తున్న హీరో మహేష్ బాబు. తాజాగా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మహేష్ అభిమానులు కొంచెం బాధలో ఉన్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచార ప్రకారం చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఫ్యాన్స్ లో ఒక అటెన్షన్ ను తీసుకువచ్చింది. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను మే 31వ తేదీన రివీల్ చేయనున్నారు.

ఏకంగా ఈ సినిమా టైటిల్ ను థియేటర్ లలో విడుదల చేయనున్నారు. దీనితో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం.