ఆడవాళ్ళు ప్రేమించేటప్పుడు ఈ తప్పులే చేస్తారు..!

చాలా మంది ఆడవాళ్లు ప్రేమించేటప్పుడు చేసే తప్పులు ఇవి. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారు..? ఒకసారి చూసుకోండి. కొంత మంది అమ్మాయిలు ప్రేమలో పడగానే ఏదో కొత్త లోకం లోకి వెళ్ళిపోయామని అనుకుంటున్నారు. రకరకాల కలలు కంటూ ఉంటారు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటారు దాని వలన ఎలాంటి ప్రభావం వాళ్ళ పై పడుతుందనేది చూద్దాం.. సహజంగా ఆడవాళ్ళకి ఎక్సైట్మెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది ప్రేమ విషయంలో కూడా అదే ఎక్సైట్మెంట్ కనబడుతుంది.

ఆ ఎక్సైట్మెంట్ తో బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు అలానే లవ్ లో పడిన తర్వాత చాలా మంది మహిళలు వారి యొక్క ప్రియుడు లోకంలోనే బతుకుతారు. వాళ్ల గురించి ఆలోచించరు. ఎప్పుడూ ప్రేమించిన వ్యక్తి తోనే సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు పైగా బాయ్ ఫ్రెండ్ కోసం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేస్తారు. దాంతో మిగిలిన వాటి మీద ధ్యాస పెట్టరు.

అలానే చాలామంది అమ్మాయిలు ప్రేమించే వ్యక్తి మీద ధ్యాస పెట్టి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని కూడా పట్టించుకోరు పైగా ప్రేమ యాక్సెప్ట్ చేయగానే భార్యగా ఫీల్ అయిపోతూ ఉంటారు. పెళ్లి వరకు వెళుతుందా లేదా అనేది అసలు ఆలోచించరు పైగా అప్పటి వరకు వాళ్ళ యొక్క ఇష్టాలని అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క ప్రియుడు ఇష్టాలనే వాళ్ల ఇష్టాలుగా భావిస్తారు ఇది కూడా చాలామంది అమ్మాయిలు చేసే తప్పు. పైగా చాలామంది అమ్మాయిలు వాళ్ళ యొక్క లక్ష్యాలను కూడా పట్టించుకోరు. వాటిని కూడా పక్కనే పెట్టేస్తుంటారు. పైగా ప్రేమించిన వ్యక్తితో క్లోజ్ అయిపోయి ప్రతి విషయాన్ని చెప్పేస్తుంటారు ప్రైవేట్ విషయాలు మొదలు ఫోటోలని షేర్ చేసుకోవడం ఇలా అన్నీ చేస్తూ ఉంటారు.