ప్రేమ వల్ల ఆత్మహత్యయత్నం చేసుకోబోయిన సూర్య.!

తెలుగు బిగ్ బాస్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు. వారిలో RJ సూర్య ఒకరు. వాస్తవానికి బిగ్ బాస్ షో కు రాకముందు తన గురించి చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే బిగ్ బాస్ షో లో అడుగు పెట్టాడో అప్పుడు అందరికీ పరిచయం అయ్యాడు. చాలా మంది మనసు గెలుచుకున్నాడు.

తాజాగా . ఓ ఇంటర్వ్యూలో సూర్య తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. చిన్నప్పుడు తమ కుటుంబం చాలా పేదరికంలో ఉండేదని, చాలా కష్టాలు పడ్డానని తెలిపాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లి దండ్రులకు భారం కాకుండా చదువుకుంటూ పీజీ వరకు చేరుకున్నాను అని తెలిపాడు.పీజీలో ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక చనిపోవాలని ప్రయత్నం చేశాను. తర్వాత నా తల్లిదండ్రులు నా బాధ చూడలేక అమ్మాయితో మాట్లాడారు.

కాని ఆ అమ్మాయి మా తల్లిదండ్రులను వదిలి వస్తేనే పెళ్ళి చేసుకుంటా అని కండిషన్ పెట్టడంతో నా తల్లదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాదని ఆమెని మరచిపోయాను. అక్కడి నుంచి చదువుకుంటూనే  అనేక జాబ్స్ కు అప్లై చేస్తూ, వెళ్ళాను. నా అదృష్టం బాగుండి నాకు రెడ్ ఎఫ్ఎం లో జాబ్ రావటం తో నా లైఫ్ టర్న్ తిరిగింది అని తన జీవితం లో జరిగిన మలుపులు గురించి చెప్పుకొచ్చాడు.