బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు వీరే..?

-

ప్ర‌తి ఏడాది లాగే ఈ సారి కూడా తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు బిగ్‌బాస్ సిద్ధ‌మ‌వుతోంది. బిగ్‌బాస్ 4కు కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైంది. ఇక క‌రోనా నేప‌థ్యంలో ఈసారి బిగ్‌బాస్ కాస్తంత ఆల‌స్యం అయింది. అయిన‌ప్ప‌టికీ నిర్వాహ‌కులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ ఈసారి షోను నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ సారి షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవ‌రు ? అనే విష‌యంపై ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఉన్నారు.

bigg boss 4 contestants guess list

బిగ్‌బాస్ సీజ‌న్ 4లో.. డ్యాన్స్ మాస్ట‌ర్ ర‌ఘు, ప్ర‌ణ‌వి, ఆటో రాం ప్ర‌సాద్ లేదా ముక్కు అవినాష్‌, హెచ్ఎంటీవీ సుజాత‌, మ‌హాత‌ల్లి జాహ్న‌వి, సుశాంత్ దంప‌తులు, నోయెల్ సేన్‌, నందు, క‌రాటే క‌ల్యాణి, స‌య్య‌ద్ సొహెయిల్ ర్యాన్‌, లాస్య, యాంక‌ర్లు ప్ర‌శాంతి, అరియానా త‌దిత‌రులు పాల్గొంటున్న‌ట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వింకా విడుద‌ల కాలేదు. ఈ రోజు క‌రోనా టెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పాజిటివ్ వ‌స్తే మాత్రం ఇంటికే ప‌రిమితం చేస్తారు. నెగెటివ్ వ‌స్తేనే బిగ్‌బాస్ హౌస్ ఎంట్రీ అన్న‌మాట‌.

మ‌రోవైపు ఆగ‌స్టు 30వ తేదీ నుంచి బిగ్‌బాస్ 4 ను ప్రారంభిస్తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌యాల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. మ‌రో 2, 3 రోజుల్లో వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news