నిజమే…జగన్ వైపున‌కు టీడీపీ కేడర్… !

-

ఏపీ చరిత్రలో ఊహించని విధంగా సీఎం జగన్ ప్రజలపై సంక్షేమ వరాలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలోనే మేనిఫెస్టోలోని దాదాపు 90 శాతం హామీలని అమలు చేశారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందించారు. రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల మంది వరకు పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు. పార్టీలకి అతీతంగా జగన్ పథకాలు అందించడం వల్ల, ఇతర పార్టీల కార్యకర్తలు సైతం జగన్‌కు మద్ధతు ఇస్తున్నారు.

ఏడాదిలోనే ఇంత మద్ధతు వచ్చిందంటే….నెక్ట్స్‌ ఎన్నికల్లో మరింత మద్ధతు కూడగట్టుకుని, జగన్ మరోసారి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలువురు విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయాన్ని సినీ నటుడు రాజా రవీంద్ర కూడా చెబుతున్నారు. జగన్ మరో 30 ఏళ్లు పాటు సీఎంగా ఉంటారా ? లేదా అన్నది చెప్పలేం కాని.. వచ్చే ఎలక్షన్స్‌‌లో మాత్రం ఖచ్చితంగా గెలుస్తారని జోస్యం చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న లీడర్లు ఆయన్ని ఓడించడం కష్టమని, అసలు కొత్త లీడర్ పుట్టుకుని రావాలంటే టైం పడుతుందని మాట్లాడారు. జగన్ చేస్తున్నమంచి మంచి సంక్షేమ పథకాల ద్వారా ఓన్ అడెండిటీ సాధించారని, దీనివల్ల టీడీపి క్యాడర్ జగన్ వైపుకి మళ్లిందని, ఆల్రెడీ టీడీపీ దెబ్బతిని ఉందని, ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదని, కాకపోతే ఆ పార్టీకి ఒక కొత్త నాయకుడు వస్తే ఏదైనా ప్రభావం చూపవచ్చని, కానీ దానికి సమయం పడుతుందని చెప్పారు.

అయితే రాజా రవీంద్ర చెప్పింది…చాలా వరకు నిజమే. జగన్ అధికరంలోకి వచ్చాక పార్టీ లకు అతీతంగా పథకాలు అందిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో న్యాయం జరగని టీడీపీ కార్యకర్తలకు సైతం జగన్ పథకాలు ఇస్తున్నారు. దీంతో కొంత టీడీపీ కేడర్ జగన్ వైపు వచ్చేశారు. ఇక నాలుగేళ్లలో మరిన్ని పథకాలు అందిస్తే మరింతగా టీడీపీ కేడర్ జగన్‌కు మద్ధతు ఇవ్వొచ్చు. దీని బట్టి చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జగన్ అధికారంలోకి రావడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news