Bigg boss-5 : లోబోకు షాక్..దమ్ముంటే మానస్ ముందు లైన్ వెయ్యాలంటున్న పింకీ..!

-

బిగ్ బాస్ సీజన్-5 ప్రారంభం లోనే మూడు గొడవలు ఆరు నవ్వులు అన్న విధంగా సాగుతోంది. ఇక మెల్లి మెల్లిగా హౌస్ లో లవ్ ట్రాక్ లు కూడా మొదలవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంకా సింగ్ కు లోబో లైన్ వేయగా అతడికి షాక్ ఇచ్చింది. వాష్ రూం వద్ద కూర్చొని ఉన్న లోబో ప్రియాంక అటు వైపు రాగా…ఐ లవ్ యూ అని చెప్పాడు.

దాంతో ప్రియాంక సింగ్ మానస్ ముందు తనకు లైన్ వేయాలంటూ తెలిపింది. అంతే కాకుండా దమ్ముంటే తనకు మానస్ ముందు లైన్ వేయాలని శపథం చేసింది. దాంతో లోబో ఆ విషయాన్ని మానస్ కు చెప్పాడు. పింకీ కి ఐలవ్యూ చెబితే నీ పర్మిషన్ తీసుకోవాలని కోరిందని చెప్పాడు. దాంతో మానస్ నా పర్మిషన్ ఎందుకు నీ హార్ట్ చెప్పింది చేయు…అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఇక వీరి ట్రాక్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news