Bigg Boss 5: నామినేష‌న్స్ “అగ్ని ప‌రీక్ష‌”.. రెచ్చిపోయి కాల్చుకున్నారు.. నామినేట్ అయిన వారెవరెవరంటే..!

-

Bigg Boss 5 : బిగ్‌బాస్‌లో టాస్కుల యందు నామినేషన్‌ టాస్కే వేరు. వారం మొత్తం స‌ర‌దాగా ఉన్నా కంటెస్టెంట్లు.. వారాంతంలో నామినేష‌న్ అన‌గానే ఒక‌రంటే.. ఒక‌రికి అస‌లు ప‌డ‌టం లేదు. బ‌ద్దశ‌త్రువులుగా మారుతున్నారు. ఇలా కంటెస్టెంట్లంద‌రూ.. కావాల్సినంత డ్రామా క్రియేట్ చేస్తున్నారు.బిగ్‏బాస్ ఐదువారాలు ముగించుకుని ఆరో వారంలోకి ఎంటర్ అయ్యింది. నిన్న కంటెస్టెంట్స్‏కు నామినేషన్స్ డే. ఇక ర‌చ్చ మామూలుగా లేదు. ఒక్క‌రిని ఒక్క‌రూ కాల్చేసుకున్నారు.

బిగ్‏బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం.. నామినేట్ చేయాల్సిన కంటెస్టెంట్స్ ఫోటోలను మంటల్లో వేస్తూ తమ అభిప్రాయాలను చెప్పాలని ఆదేశించాడు. ఇంకేముంది.. ఒక‌సారిగా హౌస్ మొత్తం హీట్ ఎక్కింది. త‌మ విశ్వ‌రూపం చూపించారు. కంటెస్టెంట్స్ అంద‌రూ రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగడమే కాకుండా.. వార్నింగ్స్ ఇచ్చుకున్నారు.

నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముందుగా సన్నీ ప్రారంభించారు. యాంకర్ రవి, జెస్సీలను నామినేట్ చేస్తూ..
టాస్కుల ఆడేట‌ప్పుడూ.. ర‌వి, జేస్సీల‌ ప్ర‌వ‌ర్త‌న నచ్చ‌డం లేద‌ని, జేస్సీ డబ్బు కోసం ఆట ఆడాను. రవి ప్రజల కోసం ఆట ఆడాడు అనే స్టేట్మెంట్ నచ్చలేదని జెస్సీని నామినేట్ చేస్తున్న‌ట్టు తెలిపారు.
ఇక విశ్వ త‌న విశ్వ‌రూపం చూపించాడు.

యానీ మాస్టర్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. తనను తాను ఎప్పుడూ ప‌దేప‌దే స్ట్రాంగ్ అన‌డం త‌నకు న‌చ్చ‌లేద‌ని, యానీ మాస్టర్‌ ఫొటోను నిప్పులో పడేశాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన యానీ ఒక్క‌సారిగా కాళీమాత అవ‌తారమెత్తింది. త‌నను ఇకనుంచి అక్క అని పిలవద్దంటూ సిరియ‌స్ అయ్యింది. తర్వాత అతడు ప్రియాంక సింగ్‌ను నామినేట్‌ చేశాడు. సంచాలక్ గా ఉన్న సమయంలో ప్రియ త‌న‌ని త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని నామినేట్ చేశాడు.

ఇక శ్వేత.. సిరి, కాజల్‏ను నామినేట్ చేసింది. తర్వాత వచ్చిన లోబో.. ప్రియాంక, జెస్సీలను నామినేట్ చేశాడు. నమ్మకం అంటే చచ్చిపోతా, అలాంటిది తన నమ్మకాన్ని ప్రియాంక చంపేసింది. అనంత‌రం జెస్సీ కూడా లోబోపై ఫైర్ అయ్యారు. నమ్మకంతో తనకు పని లేదని, గేమ్‌ ఆడటానికి వచ్చానని త‌న‌దైన స్టైల్ లో బ‌దులిచ్చారు.

ఇక సిరి.. శ్రీరామచంద్ర, శ్వేతలను నామినేట్ చేసింది. అనంత‌రం సిరి వంతు.. కెప్టెన్సీలో శ్రీ‌రామ్ ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌ని నామినేట్‌ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. నా గేమ్ .. నా ఇష్టం, నీతులు చెప్ప‌డం నాకు అస‌లు న‌చ్చ‌లేదంటూ.. చిర్రెత్తిపోయింది. ఇక యాంకర్‌ రవి.. కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్‌ చేయలేదని మానస్‌ను నామినేట్‌ చేశాడు. జనాలను ఎంటర్‌టైన్‌ చేయాలని తాను, లోబో బిగ్‌బాస్‌కు వచ్చామని, కానీ మా ఇద్దరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ సిరి ఫొటోను కాల్చి బూడిద చేశాడు.

అనంతరం జెస్సీ వ‌చ్చి శ్రీరామచంద్ర, సన్నీలపై ఫైర్ అయ్యాడు. వారిద్ద‌రిని నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక త‌నను నామినేట్ చేసినా లోబో నామినేట్ చేసింది. ఆ త‌రువాత విశ్వ బిహేవియ‌ర్ న‌చ్చ‌లేద‌ని నామినేట్ చేసింది. ఇక మానస్.. రవి, లోబోలను నామినేట్ చేయ‌గా.. ఇక యానీ మాస్టర్ వ‌చ్చి .. త‌న ప్ర‌తికారాన్ని తీర్చుకుంది. విశ్వ, షణ్ముఖ్‎లను నామినేట్ చేసి సిరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది.

శ్రీరామచంద్ర.. సిరి, షణ్ముఖ్‏లను నామినేట్ చేశాడు. కాజల్.. శ్రీరామచంద్ర, శ్వేతలను నామినేట్ చేసింది. ఇక షణ్ముఖ్.. శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేశాడు. ఇక చివరన వచ్చిన ప్రియ.. విశ్వ, సన్నీలను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం షణ్ముఖ్‌, ప్రియాంక సింగ్‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news