Bigg Boss 5 Telugu: తాను త‌ప్ప‌.. మిగితా ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఇలా క‌లిశారు

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5. ఈ కార్య‌క్ర‌మం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు బిగ్‏బాస్ గేమ్ షో 60 రోజులు పూర్తిచేసుకుంది. అంటే దాదాపు సగం షో విజయవంతంగా పూర్తి అయ్యింది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభ‌మైనా షోలో ఇప్పుడు 11 మందికి చేరింది.

అయితే.. తొలివారం సరయూ ఎలిమినేట్ కాగా.. రెండవ వారంలో కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదు, ఆరు వారాల్లో హమీదా, శ్వేత ఎలిమినేట్ కాగా.. ఇక ఏడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అనంతరం ఒక్కోక్కరు ఇంటర్వ్యూలు ఇస్తూ.. షో గురించి.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 5 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల అంద‌రూ ఒక్కచోటుకి చేరారు. నట‌రాజ్ మాస్టర్ ఇంట్లో ఉమాదేవి, ప్రియ‌, శ్వేతా, స‌ర‌యు, హ‌మీదా క‌లిసి న‌ట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిని ఇలా చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే పార్టీకి సరయు మాత్రం రాలేదు. సరయు మినహా.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సభ్యులంతా కలిసి.. ఓ రెంజ్లో ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఎనిమిదవ వారంలో బిగ్ బాస్ ఇంటి లోబో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

గ‌తంలోను బిగ్ బాస్ హౌజ్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ స‌ర‌దాగా కలుసుకోవ‌డం, అప్పుడప్పుడు ఫ‌న్‌కి సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేయ‌డం వంటివి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news