Bigg Boss 5 Telugu: లిప్‌లాక్ తో రెచ్చిపోయిన జంట‌ ! నెటిజన్స్ ఫైర్.

-

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. బాహ్య ప్ర‌పంచంతో సంబంధం లేకుండా..ఎవ‌రో తెలియ‌ని హౌజ్‌మేట్స్‌తో స‌హా జీవ‌నం చేయ‌డం. విభిన్న మ‌న‌స్కుల‌తో ఉండే స‌మ‌యంలో గొడవలు, అల్ల‌ర్లు స‌హ‌జ‌మే. ఈ త‌రుణంలో శత్రుత్వమే కాదు ప్రేమలు, స్నేహాలు కూడా చిరుగురిస్తాయి. తాజాగా ప్రసారమవుతోన్న 5 సీజ‌న్ లో కూడా ఇలాంటి ఓ బంధానికి బీజం పడింది. ఆ జంటే.. సిరి, ష‌న్ను.. వీరిద్ద‌రూ హౌస్ లోకి రాక‌ముందు నుంచే మంచి స్నేహితులు క‌లిసి.. చాలా షాట్ ఫిల్మీం చేశారు. అదే స్నేహా బంధాన్ని ఈ షో కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ వీరిద్ద‌రి వ్యవ‌హ‌రం చాలా తేడా గా ఉంది. ఇప్ప‌టికే సిరి వేరే అబ్బాయిని, అలాగే ష‌న్ను కూడా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు.


అయినా .. వారిద్ద‌రూ వారి హ‌ద్దులు దాటి .. తెగ క్లోజ్‌గా మూవ్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కెమెరా ముందే.. హగ్‌లు, ముద్దులతో రెచ్చిపోతున్నారు. అప్పుడప్పుడు అలకలు, కోపాలు, గొడ‌వ‌లు కూడా ప‌డుతున్నారు. అస‌లు వీరిద్ద‌రూ మ‌ధ్య ఏం జ‌రుగుతుందో తెలియ‌క .. అయోమ‌యంలో ఉన్నారు. సోష‌ల్ మీడియాలో కూడా అదే టాక్. సిరి , ష‌న్నులు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ తామిద్ద‌రం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామని చేప్పుకొస్తున్నారు.

ఈ క్ర‌మంలో నిన్న జ‌రిగిన ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర సన్నివేశం జ‌రిగింది. నెట్టింట్లో ఆ క్లిప్ చూస్తుంటే.. వారిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ హైప్ కు వెళ్లింది. ఇంటి స‌భ్యులు అంద‌రూ చూస్తుండ‌గానే.. హ‌గ్గుల‌తో రెచ్చిపోయిన‌ట్టు తెలుస్తోంది. కానీ.. కొంద‌రూ నెటిజ‌న్లు హగ్గులే కాదు..లిప్ లాక్ తో రెచ్చిపోయిన‌ట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

బుధ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో సిరి, షన్నుల మధ్య చిన్న వివాదం నెల‌కొంది. ఈ వివాదం ఎందుకు జ‌రిగిందో ఎవ్వ‌రికీ అర్థం కాలేదు. కానీ సిరి మాత్రం… ఐ హేట్ యూ అంటూ ఓ టిష్యూ పేపర్ పై రాసి షణ్ణుకు ఇచ్చింది సిరి. దీంతో షాక్ అయినా.. ష‌న్నూ..ఐ హేట్ యూ ఏంట్రా.. నేను ఏం చేశాను.. అంటూ సిరిని అడిగాడు ష‌న్నూ. మ‌ళ్లీ ఏం జ‌రిగిందో తెలియ‌దు.. నిన్న‌టి ఎపిసోడ్లో వీర‌ద్ద‌రూ క‌లిసి మాట్లాడుకున్నారు. ఐతే, స‌డెన్ గా .. సిరి మాట్లాడుతునే.. ష‌న్నూకు హ‌గ్ చేసుకుంది. అయితే.. ఓ వైపు నుంచి.. లిప్ లాక్ చేసి.. హ‌గ్ చేసుకున్న‌ట్టు కనిపిస్తోంది.

ఐతే అది అంత స్పష్టంగా కనిపించనప్పటికీ.. ఖచ్చితంగా లిప్ లాక్ పెట్టిందని నెటిజర్లు కామెంట్స్ చేస్తున్నారు. అది లిప్ లాక్ కాద‌నీ, జస్ట్ హగ్ మాత్రమే అని మ‌రికొంద‌రి అభిప్రాయం. కానీ, సిరి చేసిన ప‌నికి షన్నూ మాత్రం ఖంగుతిన్నట్టు అనిపించింది. ఏదిఏమైనా.. వీరిద్దరి వ్య‌వ‌హ‌రం తేడాగానే ఉంది.
బిగ్ బాస్ కు కావాల్సినంత .. కంటెంట్ ఇస్తున్నారన్న‌డంతో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి చేష్టాల‌తో సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజ‌న్లు. మ‌రోవైపు ఏంటీ ఈ చెండాలం… ఎందుకు ఇలాంటి షోలు ప్ర‌సారం చేస్తోన్నార‌నీ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హౌస్‌లో వీరిద్దరి వ్యవహార శైలి మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news