దేశ రైతాంగం ఇవాళ అద్భుత విజయాన్ని సాధించింది. ఏడాది కాలం నుంచి పోరాటం చేస్తున్న రైతుల కష్టానికి ప్రతిఫలం లభించింది. ఇవాళ ఉదయం జాతినుద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేశారు నరేంద్ర మోడీ. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాల్లో ను వెనక్కి తగ్గని మోడీ సర్కార్.. అన్నదాత ఆగ్రహానికి తగ్గింది.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కిసాన్ ఉద్యమాలు హోరెత్తాయి. ముఖ్యంగా పంజాబ్ అలాగే హర్యాన రైతులు.. చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు, నిరసనలు తెలిపారు. అయితే… శివ జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ రైతుల కు క్షమాపణలు కూడా చెప్పారు. తమ నిర్ణయాల వల్ల బాధపడి ఉంటే క్షమించాలి అంటూ కోరారు. ఇప్పటికైనా రైతులు ఆందోళన విరమించాలన్నారు. మూడు వ్యవసాయ సాగు చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు.