Bigg Boss 5: ఏంట్రా ష‌న్ను.. ఏంది క‌థ‌.. 8 మంది టార్గెట్ నువ్వే..!

-

Bigg Boss 5: బుల్లితెర ప్రేక్షకులు అత్యంత అమితంగా ఇష్ట‌ప‌డుతున్న బిగ్గెస్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5. ఈ షో విజ‌య‌వంతంగా ఐదోవారంలోకి ఎంట‌ర్అయ్యింది. గత నాలుగు వారాలుగా కంటెస్టెంట్లంద‌రూ ఎంట‌ర్టైన్ చేస్తూ.. టైటిల్ పోరులో తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైనా.. ఈ షోలో ప్ర‌స్తుతం 15మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడోవారం లహరి ఎలిమినేట్ కాగా తాజాగా నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఇదిలాఉంటే.. నామినేష‌న్లు అన‌గానే.. హౌస్‌లో హీట్ జ‌న‌రేట్ అవుతుంది. వారం మొత్తం ఎంతో అన్యూనంగా ఉన్నవారు .. ఒక్క‌సారిగా బ‌ద్ద శ‌త్రువులుగా మారుతారు. త‌మ విశ్వ‌రూపం చూపిస్తారు. అయితే .. ఈ సారి బిగ్ బాస్ గేమ్ ప్లాన్ మార్చాడు. ఎప్పటిలానే నామినేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌కుండా.. కాస్త‌.. ఢిపిరేట్ గా నామినేష‌న్ ప్ర‌క్రియ నిర్వహించారు బిగ్ బాస్‌.

ఈ సారి.. ఒక్కొక్క కంటెస్టెంట్ ను పవర్ రూమ్ కు పిలిచి, వారు నామినేట్‌ చేయాలని అనుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లను చేప్పించాడు. ఎవ‌రూ చూస్తాలేరుగా.. అని కంటెస్టెంట్లందరూ.. తమ మనసులో ఉన్న‌ది లేనిదీ అంత నిర్మొహమాటంగా బ‌య‌ట‌పెట్టేశారు. న‌చ్చ‌వారి పేర్లు చెప్పి .. నామినేట్‌ చేసేశారు.

అబ్బా .. ఈ సారి చాలా కూల్ గా నామినేష‌న్ జ‌రిగాయని అనుకునే లోపే.. ఎవరెవరి పేర్లను, ఎవరెవరు నామినేట్ చేశారో ఫోటోలతో సహా, హౌస్ లోని టీవీలో డిస్ ప్లే చేశాడు బిగ్ బాస్. దీంతో ఒక్క‌సారిగా హౌస్ మొత్తం హీటయ్యింది.

ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో చూద్దాం..

లోబో ను జెస్సీ, ప్రియాంకలు నామినేట్ చేశారు. సన్నీని కాజల్, ప్రియ నామినేట్ చేయ‌గా.. విశ్వ ను ఆనీ, షణ్ముఖ్ నామినేట్ చేశారు. హమీదాను ప్రియాంక, సిరిలు , అలాగే మానస్ ను లోబో, శ్వేతా, షణ్ముఖ్ లు టార్గెట్ చేశారు. ప్రియను సన్నీ, హమీదాలు .. జెస్సీను విశ్వ, రవి, మానస్, శ్రీరామ్ లు నామినేట్ చేశారు. యాంకర్ రవిని జెస్సీ, కాజల్, సిరి, ఆనీ మాస్ట‌ర్ లు టార్గెట్ చేశారు. ఇక‌.. షణ్ముఖ్ జస్వంత్ ను ఏకంగా 8 మంది టార్గెట్ చేశారు. అందులో సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ ఉన్నారు.

ర‌స‌వ‌త్తరంగా సాగిన ఈ నామినేషన్ లో మునుపెన్నడు లేనివిధంగా షణ్ముఖ్‌ను ఏకంగా 9 మంది.. టార్గెట్ చేశారు.సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ అందరు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడం. విశేషం. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఒకే వారంలో 9 మంది నామినేట్ కావడం ఇదే తొలిసారి. అలాగే.. ఒక కంటెస్టెంట్‌ని ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ చేయడం ఇదే తొలిసారి.

మొదట తనని ఎవరూ నామినేట్ చేయడం లేదని కన్ఫెషన్ రూంలో చెప్పిన షణ్ముఖ్.. బయటకు వచ్చిన తరువాత .. నా ఆట ఏంటో.. ఎలా ఉంటుందో.. ఇప్పుడు చూపిస్తానా అంటూ సవాల్ చేశాడు. ఆ తరువాత జెస్సీ విషయంలో శ్రీరామ్‌తో అన‌వ‌స‌రంగా గొడ‌వ‌ప‌డ్డారు షన్ను. చికెన్ రూంలో ఏం జ‌రుగుతుందో
తెలియకుండా మధ్యలోకి దూరిపోయి.. అడ్డంగా వాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news