మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడవద్దని తండ్రి హెచ్చరించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన బాలాపూర్ చోటు చేసుకుంది మనోహర్ ఆచారి లావణ్య దంపతులకు కౌశికి అను శ్రీ కుమారుడి రేవంత్ ఉన్నారు కౌశికి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కౌశికి తరచూ మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడటం గమనించిన తండ్రి ఆదివారం రాత్రి మందలించారు.
దాంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని రాత్రి 9:30 గంటల సమయం లో ఫోన్ పక్కన పెట్టి గదిలోకి వెళ్ళి ఉరివేసుకుంది. గదిలో నుండి అరుపులు వినిపించడం తో అదే గదిలో ఉన్న సోదరి వెంటనే డోర్ తెరిచింది. తల్లి చుట్టుపక్కల వారిని పిలిచి కూతురుని కిందకి దింపి ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే కౌశికి కన్నుమూసింది. ఈ ఘటన పై తల్లి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.