Bigg Boss: నామినేషన్స్ పూర్తయినా.. బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఇంకా హీట్ తగ్గడం లేదు. చిన్న చిన్న విషయాలైనా… బూతద్దాల్లో పెట్టి చూస్తూ గొడవలకు పాల్పడుతున్నారు. నానా హంగామా చేస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. బుల్లి తెర ప్రేక్షకులకు పుల్ మీల్స్ లాంటి.. ఎంటర్ టైన్ అందిస్తున్న బిగ్ బాస్.. సక్సెస్ పుల్ గా ఆరోవారానికి చేరుకుంది. ఈవారం ఇంటి కొత్త కెప్టెన్గా విశ్వ తన విశ్వరూపం చూపిస్తున్నారు.
తాజా నిన్నటి( శుక్రవారం) ఎపిసోడ్లో శ్వేత.. ప్రియతో అడ్డంగా వాదిందించింది. తప్పు చేసి మరీ.. పక్క కంటెస్టెంట్లతో గొడవపెట్టుకుంది. మీ టోన్ నచ్చలేదంటూ ప్రియపై ఫైర్ అయ్యింది. ఆ వివరాలెంటో తెలుసుకుందాం.. ఇక వంట విషయంలో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. తొలుత లోబో విశ్వాల మధ్య ఫన్నీ కన్వర్ జేషన్ జరిగింది. ఒరేయ్ విశ్వ.. ఛాయ్ ఇంకా కాలేదారా? నిన్ను కష్టపడి నిన్ను కెప్టెన్ చేస్తే ఏందీ ఇది? అని లోబో విశ్వను అన్నాడు.
దీంతో విశ్వా.. రెండు నిమిషాల్లో తెస్తాను సర్.. నువ్వేం కష్టపడినవ్ నన్ను కెప్టెన్ చేయానికి అంటూ సైటైర్ వేశాడు విశ్వ. షో చాలా కూల్ గా , ఫన్నీగా ఉందని అనుకునే లోపే.. వాట్ వాటర్
విషయంలో హౌస్‌లో హీట్ పెరిగింది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అన్నం ఉడుకుతుండగా, దాన్ని తీసి పక్కన పెట్టేసి హాట్‌వాటర్ పెట్టుకుంది శ్వేత. ప్రియా వచ్చి హాట్ వాటర్ ఎవరు పెట్టారు అని అడిగింది. దీంతో పక్కన ఉన్న కంటెస్టెంట్లు శ్వేతా అని చేప్పారు. అసలు రైస్ కుక్ అవుతుంటే..ఎలా తీసేస్తారు. సగంలో ఆగిపోతే రైస్ బాగుంటుందా అని సీరియస్ అయ్యింది ప్రియ.
ప్రియ మాటలు విన్న శ్వేత.. చాలా సీరియస్ అయ్యింది. కిచెన్ లోకి రాకెట్ లా దూసుకవచ్చింది. నేను అది చూడలేదు ప్రియా గారు అని శ్వేత అనగానే.. చూడాలి అని చెబుతున్నాను. ప్రియా అందరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే ఇక్కడ అందరు రెస్పాన్సిబుల్ గానే ఉన్నారు అని శ్వేత సీరియస్ అయింది. అంత అవసరం లేదు.. ఆ టోన్ అవసరం లేదు. నాకు నచ్చలేదు అని శ్వేత అంటే ప్రియా సెటైర్ గా నీకు ఏదీ నచ్చదు అని అంది.
ఇంతలోనే విశ్వ వచ్చి.. ఏ టైమ్ కు లంచ్ పెడతారు అనేస్తాడు.. వెంటనే .. నాకు తెలియదు నాది బాత్ రూమ్ టీం అంటూ మళ్లీ లోపలికి వెళ్లి రచ్చ స్టార్ట్ చేస్తుంది శ్వేత. ఇలా హట్ వాటర్ విషయంలో మరోసారి ఇంట్లో గొడవ జరిగింది.