BIGG BOSS-5 : ఒసేయ్ ఉమా సిగ్గు లేదా చిల్లర్.. యానీ మాస్టర్ ఆన్ ఫైర్..!

-

బిగ్ బాస్ సీజన్ 5 మొద‌లైన నాటి నుండి మిగతా సీజ‌న్ ల‌తో పోలిస్తే గొడ‌వ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రిస్థితులు సాధారణంగా ఉండి ఎలాంటి టాస్క్ లు ఇవ్వ‌న్న‌ప్పుడే గొడ‌వ‌లు షురూ చేసిన కంటెస్టెంట్ లు టాస్క్ లు ఇచ్చాక ఊరుకుంటారా. ఒక‌రి కంటే ఒక‌రు రెచ్చిపోయి గొడ‌వ‌లు పెట్టుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నిన్న‌టి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఓ టాస్క్ ఇవ్వ‌గా అందులో ఉమా మ‌రియు యానీ మాస్ట‌ర్ ల మ‌ధ్య ఓ గొడ‌వ జ‌రింగింది.

అయితే ఆ గొడ‌వ‌లో ఇద్ద‌రూ రెచ్చిపోయారు. మొద‌ట ఉమా యానీ మాస్ట‌ర్ పై కోప్ప‌డుతూ నీ య‌మ్మ అనేసింది. ఆ త‌ర‌వాత నీయంక‌మ్మ అన్నాన‌ని చెప్పింది. ఇక ఆగ్ర‌హం తో ఊగిపోయిన యానీ మాస్ట‌ర్ న‌న్నే నీ య‌మ్మ అంటావా..ఒసేయ్ ఉమా ద‌మ్ముంటే రావే..సిగ్గులేదా అలా మాట్లాడ‌టానికి. చిల్ల‌ర్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక ఆ కామెంట్ల‌ను ఉమా అబ్బో నువ్వు పెద్ద క్లాసు మ‌రీ అంటూ కామెంట్ చేసింది. ఇక నిన్న ప్రియా మ‌రియు స‌న్నీ మ‌ధ్య కూడా గ‌ట్టిగానే వివాదం నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news