కొత్త పథకానికి ఏపి కేబినేట్ గ్రీన్ సిగ్నల్..46 లక్షల మందికి లబ్ది

-

అమరావతి : పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని.. 1983 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇంటి పట్టాలు కుదువ పెట్టి తెచ్చుకున్న అప్పును ఒన్ టైం సెటిల్ మెంట్ పథకం అమలు చేయాలని తీర్మానం చేశామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. దీని వల్ల 46 లక్షల మందికి ప్రయోజనం జరుగనుందని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో 10వేలు, మున్సిపాలిటీ లో 15వేలు, నగరాల్లో 20 వేలు కట్టి రుణ విముక్తులు అవ్వొచ్చని.. ఈ ఏడాది డిసెంబర్ 21 లోపు ఈ పథకాన్ని ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుందని స్పష్టం చేశారు. అసలు, వడ్డీ కలిపి 14 వేల 600 కోట్లు ఒన్ టైం సెటిల్ మెంట్ కింద అమలు కానుందని పేర్కొన్నారు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. అలాగే 31 లక్షల మందికి ఏపీ సర్కార్.. సొంత ఇంటి స్థలం కేటాయించిందన్నారు. వీరికి బ్యాంకుల నుంచి 9% వడ్డీకి 35వేలు రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.. దీని లో 6% వడ్డీ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news