బిగ్ బాస్ 6: కళ్ళు చెదిరే పారితోషకం కైవసం చేసుకున్న ఇనయ సుల్తానా..?

-

ప్రస్తుతం బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. తెలుగులో ఆరవ సీజన్ జరుగుతున్న నేపథ్యంలో 14 వారాలు నేటితో ముగియనున్నాయి. అయితే ఈ వారానికి గాను టాప్ 2 ప్లేసులో ఇనయా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆమె ఎలిమినేట్ అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం ఏడు మంది నామినేషన్ లో ఉండగా ఈ వారం ఇనయా ఎలిమినేట్ అవ్వడంతో ఆరుగురు మాత్రమే ఉన్నారు. నిజానికి ఈ వారం తక్కువ ఓట్లు అందుకున్న వారు కీర్తి, శ్రీ సత్య.. వీరే వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు . ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోవడం ఖాయం అని వార్తలు వినిపించినా ఎవరు ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఇనయా ఎలిమినేట్ అయ్యింది. అయితే కావాలనే ఆమెను ఎలిమినేట్ చేశారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఇనయా సుల్తానాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మొదట్లో లక్కుతో వచ్చినప్పటికీ ఆ తర్వాత ప్రేక్షకుల సపోర్టు అందుకునే విధంగా గేమ్ ఆడింది. గతవారం కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సైతం మెప్పించిన ఈమె అబ్బాయిలతో పోటీపడుతూ టాప్ ఫైవ్ లో రెండవ స్థానానికి కూడా చేరుకుంది. కొన్ని పొరపాట్లే ఆమె వెళ్లిపోవడానికి కారణం అయ్యాయి. అయితే అవి ఏవీ కూడా ఎలిమినేట్ చేసే అంత పెద్ద తప్పులేమి కాదు. కానీ కొంతమంది కోసం ఇనయాను ఎలిమినేట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే 14 వారాలకు గాను ఇనయా ఎంత పారితోషకం తీసుకుంది అనే విషయానికి వస్తే వారానికి రూ.15,000 చొప్పున మొత్తం 14 వారాలకు గాను రూ.2,15,000రూపాయలను సొంతం చేసుకుంది. టాప్ ఫైవ్ లో ఉండాల్సిన ఇనయా ను కావాలనే ఎలిమినేట్ చేశారు అంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news