మాండూస్ తుఫాన్ వల్ల భారీ వర్షాలకు పంట తడిసినా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏ ఒక్క రైతును కూడా నష్టపోనివ్వమని, అందరినీ ఆదుకుంటామని చెప్పారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే సేకరించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు వచ్చామన్నారు మంత్రి. ముందు జాగ్రత్త చర్యల వల్ల నష్టాన్ని నివారించవచ్చు అని తెలిపారు.
ఇక శనివారం మాండూస్ తుఫాను నేపథ్యంలో పరిస్థితి పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మరోసారి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. భారీ వర్షం సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పునరావాస శిబిరాలను తెరిచి అన్ని రకాలుగా అండగా ఉండాలని అధికారులకు సూచించారు.