బిగ్ బాస్ 6: శ్రీ సత్య వర్సెస్ ఆదిరెడ్డి.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. ఈ వారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది.. ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగితే సరిపోతుంది అని చెప్పవచ్చు. అయితే ఉన్నట్టుండి ఊహించని విధంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు హోస్టు నాగార్జున. ఇది విన్న తర్వాత గ్రాండ్ ఫినాలే లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఇదేం కర్మ రా బాబు అంటూ ప్రతి ఒక్కరూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పోతే ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం కూడా తెలియకుండా పోతుంది. టాప్ ఫైవ్ అనుకున్న ఇనాయా గతవారం ఎలిమినేట్ అవ్వడం ఎవరు ఊహించలేదు. అంతేకాదు ఆమెను ఎలిమినేట్ చేయడంతో అభిమానులు ఫైట్ కూడా చేస్తున్నారు.

ఇకపోతే ఈ లాస్ట్ వీక్ లో మిడిల్ వీక్ ఎలిమినేషన్ రేపు రాత్రి జరగబోతోంది. టాప్ ఫైవ్ లో ఉండాల్సిన హౌస్ లో ప్రస్తుతం టాప్ సిక్స్ ఉన్నారు. అందుకే ఒకరు వీక్ మిడిల్ లో పంపే ఏర్పాటు చేస్తున్నారు హోస్ట్ నాగార్జున. దానిలో భాగంగానే రెండు రోజుల ఓట్స్ పరిగణలోకి తీసుకొని వారిని ఎలిమినేట్ చేస్తారు బయట ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరుగుతుందంటూ ప్రచారం జరగడంతో నాగార్జున బల్లగుద్ది మీ ఓటింగ్ తోనే ఎలిమినేట్ అవుతారు అంటూ గత ఆదివారం రాత్రి ఎపిసోడ్లో చెప్పారు.

మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎప్పటిలాగే రేవంత్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంటే శ్రీహాన్ రెండవ స్థానంలో ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో ఉన్నారు.. కీర్తి నాలుగో స్థానంలో ఉండగా ఐదో స్థానంలో ఆదిరెడ్డి.. ఆరవ స్థానంలో శ్రీ సత్య ఉన్నారు. ప్రస్తుతం ఫైనల్ గా ఆదిరెడ్డి వర్సెస్ శ్రీ సత్య అన్నట్టుగా ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news