ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బిగ్ షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి జీతం కట్ కానుంది.
ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్టిఫికెట్లు ఆన్లైన్ లో అప్లోడ్ చేయకపోతే జనవరి నెల జీతం నిలిపివేస్తామంటూ APCOS ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 90,609 మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. వీరిలో చాలామంది విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద లేవని APCOS పేర్కొంది. వీటిని వెంటనే ఆన్లైన్ లో అప్లోడ్ చేసి పంపించాలని ఆదేశించింది.