కోట్ల విలువ చేసే ఇల్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. అతని కోసమేనా..?

-

బిగ్ బాస్.. ఈ కార్యక్రమం ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే అందులో ఉండే కంటెస్టెంట్లకు కొత్త అనుభూతులను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాల్టీ షో హిందీ , తమిళ్, కన్నడ, తెలుగు ఇలా అనేక భాషలలో మంచి పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ముఖ్యంగా హిందీలో ఈ షో సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. ఇప్పటికే 15 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 16వ సీజన్ కూడా కొనసాగిస్తోంది. అయితే బిగ్బాస్ సీజన్ 15 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇందులో తేజస్వి, కరణ్ కుంద్రా చేసిన అల్లరి ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది.

ఇక బిగ్ బాస్ ఇంట్లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని, త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు బాగా చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు అనేకసార్లు వీరిద్దరూ కలిసి మీడియా కంట పడ్డారు కూడా. అలాగే తేజస్వి నటిస్తున్న నాగిన్ సీరియల్ సెట్ లోకి కరణ్ కూడా తరచూ వచ్చేవాడని సమాచారం. ముంబై వీధుల్లో వీరిద్దరూ కలిసి చెక్కర్లు కొట్టిన ఫొటోస్ కూడా వైరల్ అవ్వడంతో నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని వార్తలకు బలం చేకూరుతోంది.

ఇదిలా ఉండగా కరణ్ కుంద్ర, తేజస్వి దుబాయిలో విలాసవంతమైన ఒక 1 BHK ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లుగా కూడా సమాచారం. ఈ ఫ్లాటులో ఇండోర్ పూల్ కూడా ఉందట . దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవలే ఈమె గోవాలో తన సొంత ఇంటిని కొనుగోలు చేసింది. మరొకవైపు కరణ్ కుంద్రా కూడా ముంబైలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి దుబాయ్ లో ఇల్లు కొనడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

Read more RELATED
Recommended to you

Latest news