బిగ్ బాస్.. బిగ్ న్యూస్.. ఎప్పటి నుండి మొదలవుతుందటే,

తెలుగు బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదవ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. ఈ విషయమై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కరోనా థర్డ్ వేవ్ భయం కారణంగా ఆలస్యం అవుతున్న ఈ షో గురించి అదిరిపోయే వార్త బయటకి వచ్చింది. సెప్టెంబర్ 5వ తేదీ నుండీ బిగ్ బాస్ మొదలుకావచ్చని అంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ 5వ సీజన్ పనులు చకచకా సాగుతున్నాయని సమాచారం.  ఆల్రెడీ కంటెస్టెంట్లని ఎంచుకున్నారని టాక్.

ఇంకా అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మించనున్నారని తెలుస్తుంది. ఐతే హోస్ట్ గా ఎవరు చేస్తున్నారనే కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. నాగార్జున, రానా దగ్గుబాటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ రెండు సీజన్లని నాగార్జున వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ సారి కూడా నాగార్జునే ఉంటారా? లేదా సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం రానా దగ్గుబాటి లైన్లోకి వస్తాడా లేదంటే బిగ్ బాస్ యాజమాన్యం మరెవరినైనా వ్యాఖ్యాతగా తీసుకువచ్చేందుకు ఆలోచన చేస్తుందా అన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలిసి రాదు.