బిగ్ బాస్: హౌస్ నుంచి గ్లామర్ బ్యూటీ ఎలిమినేట్ అయ్యిందిగా..!

-

బిగ్ బాస్ ఆరవ సీజన్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టాప్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా నిలుస్తారనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వడం ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా మొన్నటి వరకు గలాటా గీతూ ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత గీతూ వెళ్ళనంటూ పెద్ద రచ్చే చేసింది. ఇకపోతే గతవారం డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి. ఈ ఎలిమినేషన్స్ లో ముందుగా బాలాదిత్య శనివారం ఎలిమినేట్ అయ్యి బయటకు రాగా.. హౌస్ లో రేలంగి మామయ్యలా మంచితనానికి మారుపేరులా ఉన్న బాలాదిత్య అవస్థ నుంచి బయటకు రావడంతో నిజంగానే అందరూ షాక్ అయ్యారు. అలాగే నిన్నటి ఎపిసోడ్లో గ్లామర్ క్వీన్ వాసంతి కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

ఈవారం మొత్తం ఎనిమిది మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉండగా ఒక్కొక్కరు సేఫ్ అవ్వగా.. చివరికి మెరీనా, వాసంతి మిగిలారు. దాంతో ఇద్దరికీ లాస్ట్ లో హోస్ట్ నాగార్జున ఒక చిన్న పరీక్ష పెట్టడం ఆ టెస్ట్ ఫలితం వల్ల వాసంతి ఎలిమినేట్ అయింది. నామినేషన్స్ లో ఉన్నవారికి ఒక సిలిండర్ లాంటి వస్తువు ఇచ్చి.. దాని లోపల ఉన్న దాన్ని బయటకు తీయాలని తెలిపారు నాగార్జున. నిచ్చెన వస్తే సేఫ్ అని.. పాము వస్తే అన్ సేఫ్ గా అని తెలిపారు. అలా మెరీనా ఆదిరెడ్డి శ్రీహాన్ రేవంత్ వాసంతి వినాయకులకు పాము రావడంతో అన్సేఫ్ గా మిగిలారు. అలాగే కీర్తి, ఫైమాకి నిచ్చెన రావడంతో ఇద్దరూ సేఫ్ అయ్యారు.

చివరికి మెరీనా, వాసంతి మిగలగా.. వాసంతి ముందు ఫిష్ బౌల్స్ ఉంచిన నాగార్జున వారి చేతికి ఫ్లవర్ ఇచ్చి అందులో ముంచాలని చెప్పాడు. ఎవ్వరి పువ్వు అయితే రెడ్ కలర్లో మారుతుందో వాళ్ళు అవుట్ అని చెప్పారు. ఈ గేమ్ లో మెరీనా సేఫ్ అవ్వగా వాసంతి అన్ సేఫ్ అయి ఎలిమినేట్ అయింది. దీంతో వాసంతి కన్నీళ్ళతో హౌస్ ను వీడక తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news