రైతులకు అలర్ట్‌.. 13వ విడత పీఎం కిసాన్‌ డబ్బులను పొందాలంటే ఇలా చెయ్యండి…!

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా లాభాలను రైతులు పొందుతున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్నో స్కీమ్స్ ని అందించారు. అయితే వాటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ స్కీమ్ ద్వారా చాలా మందికి డబ్బులు వస్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఇక రావాల్సి వుంది.

farmers

13వ విడత డబ్బులు ని రైతులు పొందాలంటే ఈ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరి. కేవైసీ లేకపోతే 13వ విడత డబ్బులు రావు. ఈ డబ్బులని పొందాలంటే రేషన్ కార్డు కాపీని సమర్పించాల్సి వుంది. అలానే ఆధార్ ని కూడా సబ్మిట్ చేయాల్సి వుంది. రేషన్ కార్డ్ సాఫ్ట్ కాపీ కాకుండా పీడీఎఫ్‌ ని ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ కోసం రేషన్ కార్డ్ కాపీని సబ్మిట్ చేయాలి.

హార్డ్ కాపీకి బదులు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ ఫైల్ ని సబ్మిట్ చేయాలి. పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లి అప్లోడ్ చేయాల్సి వుంది. ఒకవేళ కనుక రైతులు వీటిని సబ్మిట్ చెయ్యకపోతే ఈ డబ్బులు అందవు. రూల్స్ ప్రకారం చూస్తే ప్రతి లబ్ధిదారుడు తన భూమికి సంబంధించిన పత్రాలను సబ్మిట్ చేయాలి. ప్రతీ ఏటా కూడా ఈ స్కీమ్ కింద రైతులకి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున మూడు విడతలుగా పడతాయి. అక్టోబర్ 2022లో 12వ విడత డబ్బులు పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news