బిగ్ బాస్: మొండిగా ప్రవర్తిస్తున్న ఇనయా.. అతడి అండ చూసుకునేనా..?

-

బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి నుంచి దూకుడు ఆటతో ఆకట్టుకుంటున్న ఇనయ తన ఎటాకింగ్ మోడ్ తో హౌస్ మేట్స్ కి షాక్ ఇస్తోంది. అంతేకాదు తాను చెప్పదలుచుకున్నది ఏదీ కూడా దాచుకోకుండా నిర్మొహమాటంగా కక్కేస్తూ మరింతగా ఇబ్బంది పెడుతోంది. సూర్య విషయంలో ఆమె ఆడిన డబుల్ గేమ్ తో ఆడియన్స్ ఆమెతో జాగ్రత్తగా ఉంటున్నారు. టాస్క్ల విషయంలో కూడా ఇనయాతో కంటెస్టెంట్లకి గొడవలు తప్పడం లేదు. సోమవారం జరిగిన నామినేషన్ లో లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఈమె చేసిన తప్పుల గురించి చెప్పినా కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం..

ఎవరు ఎంత క్లారిటీగా చెప్పినా సరే నేనింతే.. నా ఆట తీరు ఇంతే అన్నట్టుగా కూడా మాట్లాడింది. అంతేకాదు హౌస్ లో ఉన్న వారంతా ఒకవైపు అయితే ఇనయా మాత్రమే మరొకవైపు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఆమె మొండిఘటనగా మారిపోయింది . ఈమెను చూసి ప్రతి ఒక్కరు కూడా రాంగోపాల్ వర్మ అండ చూసుకొని ఇలా ప్రవర్తిస్తుందా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రాంగోపాల్ వర్మ ఈమెకు ప్రత్యేకంగా ఓటు వేయండి అని ప్రమోట్ చేయడంతో ఈమెకు మరింత పాపులారిటీ దక్కింది. ఈ క్రమంలోనే వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ ఈమెకు సపోర్ట్ చేస్తున్నాడు అంటూ చాలామంది కూడా ఈమెను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.ఈ అండ చూసుకొని ఆమె మరింతగా రెచ్చిపోతుంది.

ఎలాగైనా సరే టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలవాలని చూస్తోంది. అంతేకాదు ఈమె హౌస్ లో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోందని చెప్పాలి. ఇన్నాళ్లు తన ఫ్రెండ్ అనుకున్న ఫైమాతో కూడా గొడవ పెట్టుకుంది. నామినేషన్స్ లో వీరిద్దరి మధ్య గట్టి మాటలు యుద్ధమే కాదు.. జుట్టు జుట్టు పీక్కునే స్టేజ్ వరకు వెళ్లారు. దీన్ని బట్టి చూస్తే ఇనయా ఎంతగా బిహేవ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news