బిగ్ బాస్: అభిజిత్ కి వార్నింగ్ ఇచ్చిన మోనాల్ అక్క.. వెనకాల మాట్లాడొద్దంటూ..

బిగ్ బాస్ లో ఈ వారం కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. గురువారం జరిగిన ఎపిసోడ్ లో ఆరియానా ఫ్రెండ్, మోనాల్ అక్క, సోహైల్ నాన్నగారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. 70రోజులుగా ఒకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లు అందరికీ వారి కుటుంబ సభ్యులని కలుసుకునే అవకాశం రావడంతో ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయారు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన ఒక్కొక్క అతిధి, తమ కంటెస్టెంట్ గురించి బాగా ఆడుతున్నావని, అందరూ కూడా బాగా ఆడుతున్నారని తెలిపారు.

ఐతే ఒకే ఒక్కరు మాత్రం షాకిచ్చారు. ఆమె ఎవరో కాదు మోనాల్ అక్క హెమాలి. మోనాల్ తల్లిదండ్రులు హైదరాబాద్ కి రాలేకపోవడంతో తన అక్క హైదరాబాద్ లోని బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం గల హెమాలి గారు, మోనాల్ ఆట బాగా ఆడుతుందని, అలాగే ఆడమని చెబుతూ, సోహైల్ చాలా సూపర్ గా ఆడుతున్నాడని అంది. ఇంకా అఖిల్ కూడా బాగానే ఆడుతున్నాడని, అభిజిత్ వైపు తిరిగి నువ్వు కూడా బాగానే ఆడుతున్నావు. కానీ వెనకాల మాట్లాడ్డం తగ్గించు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మొహం మీదే చెప్పు. వెనకాల మాట్లాడవద్దు అని చెప్పింది.

ఇంకా, మాట్లాడడం బాగా తగ్గించావని, అలా ఉండకుండా మాట్లాడమని సలహా ఇచ్చింది. మిగతా అతిధుల్లో ఎవ్వరూ ఈ విధంగా మరో కంటెస్టెంట్ పై ఆరోపణలు చేయలేదు. గత సీజన్లలో కూడా ఇలాంటి కామెంట్లు చేసినవాళ్ళు తక్కువ. మొత్తానికి హౌస్ అతిధుల రాకతో పాజిటివ్ వైబ్స్ తో నిండిపోయింది. ఒక్కొక్కరు వచ్చి తమ కంటెస్టెంట్ వెయ్యి టన్నుల ఎనర్జీని ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇక రేపటి ఎపిసోడ్ ఇంకా ఎమోషనల్ గా సాగనుంది. లాస్య కుటుంబం బిగ్ బాస్ హౌస్ లోకి విచ్చేయనుంది.