బిగ్ బాస్: ఈ సీజన్ లవర్ బాయ్ ని తయారు చేస్తున్న నాగార్జున..

బిగ్ బాస్ సీజన్ 5 మొదలై ఏడు రోజులు కావొస్తుంది. 19మంది కంటెస్టెంట్లతో హౌస్ అంతా గోలగోలగా ఉంది. ఇప్పటికీ ప్రేక్షకులకు కొందరు కంటెస్టెంట్ల పేర్లు గుర్తుండడం లేదు. ఎక్కువ మంది యూట్యూబ్ స్టార్లే ఉండడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. లోబీ, యాంకర్ రవి, నటుడు విశ్వ, యూట్యూబర్ సరయు, షణ్ముఖ్ జశ్వంత్ ఇంకా మిగతా కొద్ది మంది మాత్రమే జనాల్లో ఒక పాపులారిటీ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు.

ఐతే ప్రతీసారీ బిగ్ బాస్ హౌస్ లో ఒక ప్రేమాయణం నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమాయణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే నాగార్జునే నీళ్ళు పోస్తారు. గత రెండు సీజన్లలోనూ ఇలాగే జరిగింది. ఈ సారి కూడా అలానే జరుగుతున్నట్టు అర్థం అవుతుంది. ఎవరితో సెట్ అయ్యింది? ఎవరితో కట్ అయ్యింది అన్న టాస్క్ ఇచ్చిన నాగార్జున, హౌస్ మేట్స్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేసాడు.

ఆ ప్రాసెస్ లో షణ్ముఖ్ జశ్వంత్ ని లవర్ బాయ్ గా తీర్చిదిద్దే ప్రయత్నమూ చేసినట్లుగా తోస్తుంది. కెప్టెన్ అయిన సిరి, తనకు సెట్ అయిన వారిగా షణ్ముఖ్ పేరును తెలపగా, అరె ఏంట్రా ఇది షణ్ణు అని నాగార్జున అనడం, దానికి షణ్ముఖ్, ముసిముసి నవ్వులు చూస్తుంటే ఈ సారి బిగ్ బాస్ లో లవర్ బాయ్ గా నిలిచేది షణ్ముఖ్ అని అనిపించక మానదు. అప్పుడే కాదు మరోసారి కూడా ఇలాగే జరిగింది.

అదలా ఉంచితే, నామినేషన్స్ లో నుండి సేవ్ అయినవారు పోగా మిగిలింది నలుగురు మాత్రమే, జశ్వంత్, సరయు, కాజల్, మానస్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ నలుగురిలో మాడల్ జశ్వంత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో!