Bigg Boss Non Stop : 4వ వారం స‌ర‌యు ఎలిమినేట్..!

-

బిగ్ బాస్ నాన్ స్టాప్.. డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ‌ర్జున హోస్టుగా వ‌స్తున్న ఈ షోకు ఫుల్ క్రేజ్ ఉంది. 5 సీజ‌న్లను పూర్తి చేసుకున్న అనంత‌రం.. బిగ్ బాస్ ను 24 గంటలు టెలికాస్ట్ చేయ‌డానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో తీసుకువ‌చ్చారు. అయితే ఈ షో ఇప్ప‌టికే మూడు వార‌ల‌ను పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగు పెడుతుంది. కాగ ఈ వారం ఎలిమినేషన్ పై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వారం ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ స‌ర‌యు ఎలిమినేట్ అవుతుంద‌ని స‌మాచారం. కాగ స‌ర‌యు పై ఓట‌ర్లు ఆస‌క్తి చూప‌లేద‌ని తెలుస్తుంది. హౌస్ లో గొడ‌వ‌లు అవ‌డానికి కార‌ణం స‌ర‌యు అని ప‌లు సోషల్ మీడియాల్లో నెటిజ‌న్లు అంటున్నారు.

అలాగే స‌ర‌యు ఇత‌ర హౌస్ మెట్స్ తో ఉంటున్న విధానం, మాట్లాడుతున్న తీరుపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం తో ఉన్నారు. దీంతో ఈ సారి నామినేషన్స్ లో ఉన్న స‌రయు ఇంటి బాట ప‌ట్ట‌డం ఖాయం అని తెలుస్తుంది. కాగ స‌రియు.. బిగ్ బాస్ సీజ‌న్ – 5 లో కూడా ఉంది. అయితే అప్పుడు కూడా త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఊహించిన దాని కంటే ముందుగానే ఎలిమినేట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news