తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ కొత్త సీజన్ ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సైతం పలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున ఈసారి హోస్టింగుగా రాలేదంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో బిగ్ బాస్ -7 కి హోస్టుగా వచ్చేందుకు సరికొత్త యాంకర్లను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంటేస్టెంట్ ల మీద కూడా ఈసారి కాస్త ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలని బిగ్ బాస్ షో నిర్వహకులు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
అయితే హోస్టుగా మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం .కానీ ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. గతంలో మాదిరే బుల్లితెరపై అలరించిన కొంతమంది కమెడియన్లను బిగ్ బాస్ -7 లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందిన రష్మీని ఇందులో తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట బిగ్బాస్ నిర్వాకులు. అయితే ఈమెకు వారానికి రూ.10 లక్షలకు పైగా ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా శ్రీముఖి బిగ్ బాస్ లోకి వెళ్లినప్పుడు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చారు.
ఇక ఇప్పుడు రష్మీ కూడా ఇంత డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. దీంతో నిర్వాహకులు కూడా ఓకే చెప్పితే కోటికి పైగా రష్మి షో వల్ల పారితోషకం అందుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ విజేతగా నిలిస్తే మరింత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్మి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నది. మరి ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షోలోకి వెళ్తే ఆమెకు లాభమా నష్టమా అన్న విషయం తెలియాల్సి ఉంది.