ఏపీ విద్యార్థులకు శుభవార్త…మార్చి 2 నుంచి విద్యార్థులకు రాగి జావ

-

ఏపీ విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై అల్పాహారంగా రాగి జావా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏపీ సర్కార్‌ ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా బెల్లంతో రాగి జావా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్చి 2వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు చొప్పున పిల్లలకు గ్లాస్ రాగి జావా ఇవ్వాలని సూచించింది. ఐరన్, కాల్షియం లోపాల నివారణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.

ఇక అటు రాష్ట్రంలో ప్రతి విద్యార్ధిని గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నామని… విద్య కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని వెల్లడించారు మంత్రి బొత్స సత్య నారాయణ. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందుందని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కి మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్ట్ ఫోలియో కూడా పెట్టామని.. అమ్మ ఒడి ద్వారా బడికి వెళ్లే ప్రతి పిల్లాడి చదువుకు డబ్బులు ఇస్తున్నామని వెల్లడించారు బొత్స.

Read more RELATED
Recommended to you

Latest news