సుషాంత్ సింగ్ రాజ్ పుత్ నా ఇన్స్పిరేష‌న్..నా డ్రీమ్ అదే..!

ఆదివారంతో బిగ్ బాస్ సీజ‌న్ -5 పూర్త‌య్యింది. కాగా ఈ సీజ‌న్ లో వీజే స‌న్నీ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ముందు నుండి త‌నదైన ఆటతీరుతో స‌న్నీ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. హౌస్ లో ఎంట‌ర్ టైన‌ర్ ఆఫ్ ది హ‌స్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా చివ‌రికి ఎంతో క‌ష్ట‌ప‌డి విజేత‌గా నిలిచాడు. కాగా భ‌య‌ట‌కు వ‌చ్చిన స‌న్నీ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. బాలీవుడ్ హీరో దివంగ‌త సుషాంత్ సింగ్ రాజ్ పుత్ త‌న ఇన్స్పిరేష‌న్ అంటూ వ్యాఖ్యానించాడు.VIJAY-SUNNY

త్వ‌ర‌లోనే తాను కేద‌ర్ నాత్ వెళ‌తాన‌ని స‌న్నీ చెప్పాడు. అంతే కాకుండా తాను రిపోర్ట‌ర్ గా కెరీర్ ను ప్రారంభించాన‌ని ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని తెలిపాడు. హీరో అవ్వాల‌న్న‌దే త‌న చిన్న నాటి క‌ల అని చెప్పారు. సీరియ‌ల్స్ న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని సినిమాల్లో న‌టించడమే త‌న డ్రీమ్ అన్నారు. హీరోగానే కాద‌ని సినిమాల్లో ఎలాంటి రోల్ వచ్చినా తాను న‌టిస్తాన‌ని స‌న్నీ తెలిపాడు. ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక డ్రీమ్ ఉండాల‌ని స‌న్నీ అన్నారు.