బిగ్ బాస్ ఇంట్లో నీళ్లు, గ్యాస్ సరఫరాను ఆపేసినట్టు బిగ్ బాస్ చెబుతాడు. పదో ఎపిసోడ్ లో తొమ్మిదో రోజు ఇంట్లో కంటెస్టెంట్లకు నరకం చూపించాడు బిగ్ బాస్.
నీరు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవిగా మారాయి. అవి లేకుండా ఒక్క రోజును ఊహించలేని స్థితికి అందరూ వచ్చారు. అయినా వాటి విలువను గుర్తించకుండా అవసరానికి మించి వాడుతూ భవిష్యత్తు తరాలకు వాటిని దూరం చేస్తున్నారు.
సో.. వాటి విలువ తెలుసుకునే సమయం ఇప్పుడు వచ్చింది. అందుకే.. బిగ్ బాస్ ఇంట్లో నీళ్లు, గ్యాస్ సరఫరాను ఆపేసినట్టు బిగ్ బాస్ చెబుతాడు. పదో ఎపిసోడ్ లో తొమ్మిదో రోజు ఇంట్లో కంటెస్టెంట్లకు నరకం చూపించాడు బిగ్ బాస్.
నీళ్లు కావాలన్నా… గ్యాస్ కావాలన్నా.. ఇంట్లోకి యాక్సెస్ కావాలన్నా.. గార్డెన్ ఏరియాలో ఉన్న మూడు సైకిళ్లను ఆపకుండా తొక్కాలి.
నీళ్లు కావాలంటే.. నీళ్ల బోర్డు ఉన్న సైకిల్ ను తొక్కుతూనే ఉండాలి. దాన్ని తొక్కుతున్నంత సేపే నీళ్లు వస్తాయి. లేకపోతే రావు. అలాగే గ్యాస్ సైకిల్ కూడా అంతే. మరోటి హౌస్ యాక్సెస్ సైకిల్. ఆ సైకిల్ తొక్కుతున్నంత సేపే హౌస్ లోకి యాక్సెస్ ఉంటుంది. వీటిలో ఏ సైకిల్ ను తొక్కడం ఆపినా.. దానికి సంబంధించినవి ఆగిపోతాయి.
హౌస్ యాక్సెస్ సైకిల్ ను ఆపితే చాలు… వెంటనే లైట్లు వెలుగుతాయి. అంటే.. రాత్రి కూడా ఆ సైకిల్ ను ఎవరో ఒక సభ్యుడు తొక్కుతూనే ఉండాలి. లేకపోతే లైట్లు వెలుగుతాయి. దీంతో ఇంటి సభ్యులెవ్వరూ నిద్రించడానికి ఉండదు.
ఇదే బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్. కాకపోతే ఈ టాస్క్ చేసే దగ్గర శ్రీముఖి, శివజ్యోతి మధ్య చిన్న గొడవ వచ్చింది. నేను తొక్కేంత సేపు తొక్కి ఆ తర్వాత రాత్రి పడుకుంటా.. అంటూ శ్రీముఖి అడగడం… దాన్ని విన్న శివజ్యోతి.. అందరూ సమానంగా తొక్కాలి కానీ.. ఇలా ముందే ఫుల్లుగా తొక్కేసి రాత్రి పడుకుంటామనడం ఏంటి… టీమ్స్ పెట్టుకొని తొక్కితే బాగుంటుంది అంటూ సలహా ఇవ్వడం.. అది ఇంటి సభ్యులకు నచ్చకపోవడం… మళ్లీ ఆ గొడవ కాస్త శివజ్యోతి, వరుణ్ లకు పాకింది.
కట్ చేస్తే వితిక, పునర్నవి మధ్య మరో గొడవ. వరుణ్ కూడా పునర్నవికే మద్దతు పలకడంతో వితిక.. బిగ్ బాస్ హౌస్ లో కాసేపు ఏడ్చింది. ఆ తర్వాత వరుణ్ వచ్చి సారీ చెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఇలా… ఇంటి సభ్యులు చిన్న చిన్న గొడవలతో హౌస్ లో తొమ్మిదో రోజును గడిపారు.
అయితే.. ఆ రోజు రాత్రి మాత్రం కొందరు సభ్యులకు నిద్రలేదు. ఎందుకంటే.. హౌస్ యాక్సెస్ ను రాత్రి మొత్తం తొక్కుతూనే ఉండాలి. అలా అయితేనే లైట్లు ఆఫ్ అవుతాయి. అందుకే.. కొందరు సైకిల్ ను తొక్కుతుండగా మరికొందరు నిద్రపోయారు.