వాట్సాప్ వినియోగదారులకు షాక్…. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.

-

వాట్సాప్ వినియోగదారుకు షాకింగ్ వార్త. ప్రతీ స్మార్ట్ ఫోన్ లో ఉండే వాట్సాప్ రేపటి నుంచి కొన్ని మోడళ్ల మొబైల్ ఫోన్లలో పనిచేయదని సంస్థ చెబుతోంది. నవంబర్ 1న వాట్సాప్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయబోతోంది. దీంతో పాత ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లకే కాకుండా ఆపిల్ ఐఓఎస్ కలిగిన ఫోన్లకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది వాట్సాప్ వినియోగదారులను కలవరానికి గురి చేస్తోంది. వాట్సాప్ పొందాలంటే కొత్త ఫోన్ల కొనుక్కోవడమో లేకపోతే తమ ఫోన్లను వాట్సాప్ కు అనుగుణంగా ఆపరేటింగ్ సిస్టంను అప్ గ్రేడ్ చేస్తే తప్పా వాట్సాప్ యాప్ ను పొందలేరు. ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 మరియు అంతకన్నా హైయ్యర్ ఓఎస్, ఐఓఎస్ 10 అంతకన్నా హైయ్యర్ ఓఎస్, కియోఓఎస్ 2.5.0 అంతకన్నా హైయర్ ఓఎస్ , జియోఫోన్ 2 ఉన్న ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుందని వాట్సాప్ తెలిపింది.

వాట్సాప్ పనిచేయడం ఆగిపోయే స్మార్ట్ఫోన్ లు:

సామ్ సంగ్: గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ 2, గెలాక్సీ ఎస్2, గెలాక్సీ ఎస్ 3 మినీ, గెలాక్సీ ఎక్స్ కవర్ 2, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎస్ 2

జెడ్ టీ ఈ: గ్రాండ్ S ఫ్లెక్స్, జెడ్ టీ ఈ V956, గ్రాండ్ X క్వాడ్ V987 మరియు గ్రాండ్ మెమో

సోనీ: ఎక్స్ పీరియా మారియో, ఎక్స్ పీరియా నియో ఎల్, ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్ 

LG: లూసిడ్ 2, ఆప్టిమస్ ఎఫ్7, ఆప్టిమస్ ఎఫ్5, ఆప్టిమస్ ఎల్3 II, డ్యూయల్ ఆప్టిమస్ ఎల్5, బెస్ట్ ఎల్5 II, ఆప్టిమస్ ఎల్5, డ్యూయల్ బెస్ట్ ఎల్3 II, ఆప్టిమస్ ఎల్7, ఆప్టిమస్ ఎల్7, డ్యూయల్ బెస్ట్ ఎల్7 II, ఆప్టిమస్ ఎఫ్6, ఎనాక్ట్ ఆప్టిమస్ ఎఫ్3, బెస్ట్ ఎల్4 II, బెస్ట్ ఎల్2 II, ఆప్టిమస్ నైట్రో హెచ్ డీ, ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్ డీ మరియు ఆప్టిమస్ ఎఫ్ 3 క్యూ.

హువాయ్: అసెండ్ జీ 740, అసెండ్ మాట్, అసెండ్ డీ క్వాడ్ ఎక్స్ ఎల్, అసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్ ఎల్, అసెండ్ పీ1 ఎస్, అసెండ్ డీ2

ఆపిల్: ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ

Read more RELATED
Recommended to you

Latest news