Bigg Boss 5: హౌస్‌లో ల‌వ్ ట్రాక్‌లు.. మిడ్ నైట్ రెచ్చిపోయిన శ్రీరామ్‌, హమీద..!

Bigg Boss5: బిగ్‏బాస్ 5 సీజన్ విజయవంతంగా కొన‌సాగుతుంది. కంటెస్టెంట్ల మ‌ధ్య గొడ‌వ‌లు, అరుపులు, కోపాలు, న‌వ్వులు, ల‌వ్ ట్రాక్‌ల‌తో రసవత్తరంగా సాగుతుంది. 12వ రోజు మ‌రికాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవించారు బిగ్ బాస్‌. ఎవ్వ‌రూ ఊహించిన విధంగా శ్రీరామ్‌, హమీద మధ్య రొమాన్స్ పీక్స్‌కు చేరింది. రొమాంటిక్ సాంగ్స్ డాన్స్ చేస్తూ.. రెచ్చిపోయారు. అదే స‌మ‌యంలో కంటెస్టెంట్స్ అంద‌రూ కాజ‌ల్ ను ఆడుకున్నారు. అందరు కలిసి ఆమెను పనిమనిషిని చేశారు.

మొదటి వారంతో పోల్చితే.. రెండో వారం హౌస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త పెరిగింద‌నే చెప్పాలి. తొలివారం కంటెస్టెంట్ల మ‌ధ్య అండ‌ర్‌స్టాండింగ్ స‌రిగా కుద‌ర‌లేదు.. దీంతో గేమింగ్ స్ట్రాట‌జీని మార్చాడు బిగ్‌బాస్‌. కంటెస్టెంట్ల మ‌ధ్య న‌వ్వుల పూవ్వులు పూయిస్తున్నాడు. అదే స‌మయంలో కంటెస్టెంట్ల మ‌ధ్య‌ లవ్‌ ట్రాక్‌లు వేసి.. షో మ‌రింత రొమాంటిక్‌గా మార్చాడు.

శుక్ర‌వారం రాత్రి ప్ర‌సారమైన షోలో జెస్సీ-శ్వేత వర్మ, మానస్‌- లహరి మధ్య సరదాగా సన్నివేశాలు, సన్నీని ఉద్దేశించి అనీ మాస్టర్, ప్రియాంక లు స‌రదా పంచ్‌లు, అదే స‌మ‌యంలో ప్రియా, ఆర్ జే కాజ‌ల్ మ‌ధ్య గొడ‌వ‌లు, అల‌క‌లు చాలా చాలా ఫ‌న్నీగా.. ఇన్ ట్రెస్టింగ్ గా షో సాగింది.

ఈ వారం బెస్ట్ పర్‌ఫెర్మర్‌ని ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో కంటెస్టెంట్ల‌లో ఎక్కువ మంది నటరాజ్‌మాస్టర్ కు ఓటేశారు. దీంతో మాస్ట‌ర్ బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా నిలిచారు. అలాగే.. ఈ వారం వరస్ట్ పర్‌ఫెర్మెర్‌ని ఎన్నుకోవాల‌ని ఆదేశించ‌గా.. మెజారిటీ సభ్యులు సన్నీని టార్గెట్ చేశారు. అత‌న్ని బిగ్‌బాస్‌ ఆదేశాల వరకు జైల్లోకి పంపించారు.

అనంత‌రం.. కాజ‌ల్, ర‌వి ఫ‌న్నీ ట్కాస్ ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో `బీబీ న్యూస్‌` రిపోర్టర్లుగా అవ‌తార‌మెత్తి.. కంటెస్టెంట్ల అంత‌రంగాల‌ను తెలుసుకునే ప్ర‌యత్నం చేశారు. అప్ప‌డే.. షోలో అస‌లైన ఎంటర్టైన్‌మెంట్ స్టార్ అయ్యింది. శ్రీరామ్‌, హహీద, సన్నీల మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని గుస‌గుస‌లు వినిపించాయి. ఇత‌ర కంటెస్టెంట్లు కూడా త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకున్నారు ర‌వి, కాజ‌ల్‌ల‌తో..

అనంత‌రం.. శ్రీరామ్‌,హమీదలు షోను పిక్స్‌కు తీసుకెళ్లారు. మిడ్ నైట్ ఓ రేంజ్‌లోరెచ్చిపోయారు. వారిద్ద‌రూ క‌లిసి ఓ క్యూట్ లవ్‌ సాంగ్‌కి రొమాంటిక్‌ స్టెప్పులేసి.. దీంతో మ‌రింత ఇన్ ట్రెస్టింగ్ గా మారింది. అలాగే.. లగ్జరీ బడ్జెట్‌లో నటరాజ్‌ మాస్టర్‌ రెండు బాల్స్ ని ద‌క్కిచుకోగా.. షణ్ముఖ్‌ ఒక బాల్‌ని, ప్రియాంక ఒక బాల్‌ని కైవ‌సం చేసుకున్నారు. షో చివ‌రి మ‌రో ఫ‌న్నీ స‌న్నివేశం చోటు చేసుకుంది. అంద‌రూ క‌లిసి షణు ను స్విమ్మింగ్‌ పూల్‌లో ఎత్తేశారు. మొత్తం మీద షో చాలా స‌ర‌దా స‌ర‌దాగా సాగింది.