బిగ్ బాస్ లీక్స్..ఈ వారం నామినేషన్స్ లో ఉంది వీరే..?

బిగ్ బాస్ సీజన్ మొదలయ్యింది అంటే చాలు లీకు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హౌస్ ఏం జరుగుతుందో ముందుగానే లీక్ చేస్తున్నారు. ఎలిమినేశన్ లో ఎవరు ఉన్నారు. టాస్కుల్లో ఎవరు గెలిచారు.. కెప్టెన్ గా ఎవరు ఎన్నికయ్యారు. ఇలా ఒక్కటి కాకుండా అన్నీ ముందుగానే లీక్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్-5 కు సైతం లీకుల బెడద తప్పడం లేదు. ఫస్ట్ వీక్ ఎవరు కెప్టెన్ గా ఎనికయ్యారో లీక్ అయ్యింది. అదే విధంగా బిగ్ బాస్ నుండి మొదటగా సరయు ఎలిమినేట్ అయినట్టు కూడా లీక్ అయ్యింది.

ఇక తాజాగా నిన్న బిగ్ బాస్ నుండి ఉమ ఔట్ అయినట్టు లీక్ కాగా అదే జరిగింది కూడా అయితే తాజాగా హౌస్ నుండి మరో లీక్ అయినట్టు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. నిన్న ఆదివారం ఎలిమినేషన్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరగ్గా ఎవరెవరు ఎలిమినేషన్ లోకి వచ్చారో ముందుగానే లీక్ అయ్యింది. ఇక ఆ లీక్ అయిన సమాచారం ప్రకారంగా ఈవారం షన్ను, శ్వేత వర్మ, సన్నీ, సిరి, కాజల్, లోబో , మానస్ లు ఎలిమినేషన్ లో ఉన్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఎపిసోడ్ టివి లో వచ్చేవరకు ఆగాల్సిందే.