బిగ్ బాస్ 5: కంటెంట్ కోసం కంటెస్టెంట్ల గలాటా.. లహరి.. కాజల్ మధ్యలో చెలరేగిన చిచ్చు

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5మొదలై రెండు రోజులు మాత్రమే అవుతుంది. అప్పుడే హౌస్ లో గలాటాలు మొదలైపోయాయి. మంగళవారం ఎపిసోడ్ రెండు ఏడుపులు, మూడు గొడవలతో సాగింది. మొదటగా పవర్ రూమ్ లోకి వెళ్ళిన విశ్వ, రవిచేత ఆడవాళ్ళ బట్టలు వేయించేలా చేసాడు. ఆ తర్వాత రవి వద్ద తన తమ్ముడి మరణం గురించి చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు. అన్నా, అన్నా.. అని రవి పిలుస్తుంటే తన తమ్ముడు గుర్తొచ్చాడని బాధపడ్డాడు. భావోద్వేగానికి గురి కానని చెబుతూనే ప్రేక్షకులందరి చేత కన్నీళ్ళు పెట్టించాడు.

ఆ తర్వాత లోబో, సిరి మధ్య జరిగిన రచ్చ హౌస్ మేట్స్ అందరినీ గందరగోళానికి గురి చేసింది. వారిద్దరూ ఒకరంటే ఒకరికి పడనట్టు అరుచుకుంటూ ఆ తర్వాత కలిసిపోవడం, కంటెంట్ కోసమే ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలను హౌస్ మేట్స్ కి కలిగేలా చేసింది. ఈ విషయంలో సరయు చేత మాటలు కూడా పడ్డారు. ఇక ఈ కంటెంట్ క్రియేషన్ గొడవ..కాజల్, లహరి మధ్య జరిగింది.

కిచెన్ డిపార్ట్ మెంట్ కోసం మాట్లాడిన కాజల్, లహరి మీద మీదకు వెళ్తున్నట్లుగా మాట్లాడుతుండడంతో కొట్టడానికి వస్తున్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇదంతా కంటెంట్ కోసమేనా అంటూ లహరి కామెంట్లు చేసింది. ఆ మాటలకు కాజల్ ఏడుపు పట్టుకుంది. ఆమెను ఓదార్చడానికి రవి, మానస్ వచ్చారు. అటాకింగ్ మోడ్ లో మాట్లాడావని రవి తేల్చేసాడు. అనంతరం, కంటెంట్ క్రియేషన్లో యానీ మాస్టర్ భాగం పంచుకుంది. ఆ రసవత్తర సన్నివేశం ఇంకా సశేషంగానే మిగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news