తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకం వాసాలమర్రిలో పైలట్ ప్రాజెక్టుగా అమలైంది. అర్హులైన దళిత కుటుంబాలకు 10లక్షలు ఇచ్చే ఈ పథకంపై అనేక విమర్శలు వస్తున్నాయి. దళితబంధు కేవలం దళితులకేనా? ఇతరులకు బంధు అవసరం లేదా అంటూ కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ విషయంలో ప్రభుత్వానిపై ఒత్తిడి రానుంది. అవును, బీసీ బంధు కావాలంటూ బీసీ సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ధర్నాచౌక్ వద్ద ఆందోళనలకు పిలుపు ఇచ్చాయి.
నేడు ఉదయం ధర్నాచౌక్ వద్ద ఆందోళనలు చేపట్టనున్నారు. అర్హులైన దళితులకు దళితబంధు ఎలా ఇస్తున్నారో, అలాగే అర్హులైన బీసీలకు కూడా బీసీ బంధు ఉండాలని, బీసీబంధు పథకాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దళితబంధు ప్రకటించిన ప్రభుత్వం, మిగతా అర్హులైనవారికి అందరిబంధు పేరుతో పథకాన్ని తీసుకొస్తాం అని మాట్లాడిన సంగతి తెలిసిందే.