బిగ్‌బాస్ 4: అఖిల్‌కి షాకిచ్చిన మోనాల్‌..సోహైల్ ర‌చ్చ దేనికి‌!

మండే నుంచి బిగ్‌బాస్ సీజ‌న్ 4 గాడిలో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. నామినేష‌న్ రౌండ్ ప్రారంభం కావ‌డంతో ఇంటి స‌బ్యుల్లో వున్న అప‌రిచితులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌ప‌డుతున్నారు. త‌మ‌కు న‌చ్చ‌ని వారిని నామినేట్ చేయ‌డం మ‌ళ్లీ మొద‌లైంది. అరియానాని కావాల‌ని మోహ‌బూబ్‌.. అత‌న్ని నామినేట్ చేసింద‌ని సోహైల్ … ఇద్ద‌రూ క‌లిసి అరియానాని నామినేట్ చేశారు. అభిజిత్ ఫ‌స్ట్ టైమ్ మోనాల్‌ని నామినేట్ చేయ‌డం.. ఈ రోజు పిల్ల‌ల టాస్క్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, హారిక, అవినాష్‌, అరియానా, మోహ‌బూబ్ మారిపోయి మిగ‌తా ఇంటి స‌భ్యుల‌కు చుక్క‌లు చూపిచ‌డం మంగ‌ళ‌వారం టాస్క్‌.

ఈ టాస్క్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్ … హారిక‌ని సైకో అంటూ లాగి కింద ప‌డేయ‌డం… ఈ టాస్క్ త‌రువాత అరియానాతో వున్న అవినాష్ ద‌గ్గ‌రికి వెళ్లి అఖిల్ చూస్తుండ‌గానే కిస్ చేయ‌డం ర‌చ్చ ర‌చ్చ‌గా మారేలా క‌నిపిస్తోంది. ఇక సోహైల్ కిచ‌న్ లోకి వెళ్లి అబిజిత్‌, లాస్య‌, నోయెల్‌, అమ్మా రాజ‌శేఖ‌ర్‌ల‌కు ఈవారం న‌న్ను నామినేట్ చేయండి ద‌మ్ముంటే అంటూ ర‌చ్చ‌కు దిగ‌డం ఇంట్రెస్టింగ్ క‌నిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల్లో తాజా స‌న్నివేశాలు బిగ్‌బాస్ సీజ‌న్ 4ని హీటెక్కించేలా వున్నాయి.

నామినేష‌న్‌లోకి రావాలంటే నాతో గొడ‌వ‌కు దిగండి..అంద‌రిని ఏసిప‌డేస్తా రాసి పెట్టుకోండి. సేఫ్ గేమ్ ఆడినా.. నువ్వు స్ట్రాంగ్ ప్లేయ‌ర్ కాదంట అని అభిజిత్ అంటే సోహైల్ ఎవ‌ర‌న్నార‌ని వీరంగం వేయ‌డం హౌస్‌లో ర‌చ్చ య‌మ క్రేజీగా జ‌రిగేలా క‌నిపిస్తోంది.