బావిలో పడ్డ జీపు.. ముగ్గురు గల్లంతు !

వరంగల్ రూరల్ జిల్లా సంగెo మండలం గవిచర్ల గ్రామ శివారు జీపు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడింది, జీప్ లో పదహారు మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో పన్నెండు మంది ప్రయాణికులు క్షేమంగా బయట పడ్డారు. ఇంకా, నలుగురు ప్రయాణికులు నీటిలోనే ఉన్నారని అంటున్నారు. పోలీసు అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. చీకటి పడడంతో పాటు బావి లోతుగా ఉండడంతో జేసీబీకి జీప్ చిక్కడం లేదు.

దీంతో ఫైర్ ఇంజన్ తెప్పించి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ బయటకు వచ్చేసినా ముందు సీట్లో ఉన్నవాళ్లు బయటకు రాలేకపోయారు. జీప్ లోనే చిక్కుకున్నారు. ఈ విషయం మీద పరకాల ఎంఎల్ఏ చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ జీపు ప్రమాదంలో బావిలో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, సీఎం కేసీఆర్ గారికి ఘటన విషయాన్ని తెలియజేశాను, బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు. ఇంకా ముగ్గురి వివరాలు అంటే డ్రైవర్ తో సహా మరో ఇద్దరు గల్లంతు కాగా వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.