గంట గంటకు క్షీణిస్తున్న బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి…

కరీంనగర్ లో నిరసన దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. 22 గంటలుగా బండి సంజయ్ నిరసన దీక్ష కొనసాగుతోంది. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ని సస్పెండ్ చేయాలంటూ నిన్న రాత్రి 9.30 గంటలకు నిరసన దీక్షకు దిగారు బండి సంజయ్. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా షుగర్ లెవల్స్ తగ్గి పోయాయి. రెండో సారి బండి సంజయ్ ని పరిక్షిస్తున్నారు వైద్యులు.

bandi sanjay
bandi sanjay

సంజయ్ సొమ్మసిల్లి స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. సంజయ్ ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయిన క్రమంలో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. ఇప్పటికే భారీ ఎత్తున పార్టీ కార్యలయం వద్ద పోలీసులు మోహరించారు. అరెస్ట్ సమాచారం తెలియడంతో ఎంపీ కార్యాలయానికి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.