బాక్సాఫీసు వద్ద తలపడనున్న రాజశేఖర్, బండ్ల గణేశ్..!

-

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపైన ఫస్ట్ నుంచి బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ పిక్చర్ మలయాళ చిత్రం ‘షిక్కర్’ రీమేక్. కాగా, తెలుగు నేటివిటీకి తగ్గట్లు బోలెడన్ని మార్పులు చేశారు. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ చిత్రానికి పోటీగా బండ్ల గణేశ్ నటించిన ‘డేగల బాబ్జీ’ చిత్రం కూడా అదే రోజున విడుదల కానుంది. దాంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది పెద్ద పోటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, యాక్టర్ అయిన బండ్ల గణేశ్ …తొలి సారి హీరోగా నటించిన చిత్రం ‘డేగల బాబ్జీ’ కూడా రీమేక్ ఫిల్మ్ అవడం గమనార్హం. ‘ఒరు సెరుప్పు సైజ్7’ అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ పిక్చర్ తెరకెక్కింది.

రంజాన్ సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని బండ్ల గణేశ్ అనౌన్స్ చేశారు. అలా బాక్సాఫీసు వద్ద రాజశేఖర్, బండ్ల గణేశ్ సినిమాలు తలపడనున్నాయి. మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల సందర్భంగా బండ్ల గణేశ్ , జీవితా రాజశేఖర్ మధ్య జరిగిన మాటల యుద్దాన్ని కొందరు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, రెండు చిత్రాలూ ‘‘ శేఖర్, డేగల బాబ్జీ’’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటాలని మరి కొందరు నెటిజన్లు , సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news