హీరో విశ్వక్ సేన్ పై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన దేవి నాగవల్లి

-

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రాంక్ వీడియో చేసి అనూహ్య వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.ఈ ప్రాంక్ వీడియో పై ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించగా..ఆ చానల్ యాంకర్ కు విశ్వక్ సేన్ కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం , విశ్వక్ సేన్ ఓ అభ్యంతరకర పదం వాడడం విమర్శలకు దారి తీసింది.దీనిపై ఆ ఛానల్ యాంకర్ దేవి నాగవల్లి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఫిర్యాదు చేశారు.దేవి వెంట జర్నలిస్ట్ ఫోరం సభ్యులు కూడా ఉన్నారు.దేవి ఫిర్యాదుపై మంత్రి తలసాని స్పందించారు..ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓ సినిమా గురించి ప్రమోషన్స్ నిర్వహించుకోవాలి అనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అలా కాకుండా ఫ్రాంక్ వీడియోల పేరిట రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరి కాదని దీనిపై తాను పోలీసు అధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు.అంతే కాకుండా, టీవీ ఛానల్ లో యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్సేన్ మధ్య జరిగిన వాగ్వాదం ని తాను కూడా చూశా అని మంత్రి తలసానిివరించారు.కానీ అటువంటి ప్రవర్తనను ఎవరూ అంగీకరించరని స్పష్టం చేశారు.తమ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news