భారత రాజ్యాంగం భారత ప్రజలకి కొన్ని హక్కులని ఇచ్చింది. ఆ హక్కుల్లో నిరసన తెలిపే హక్కు కూడా ఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలపైన అయినా తమ నిరసనని తెలుపుకోవచ్చని రాజ్యాంగం స్పష్టం చేసింది. ప్రభుత్వం అనే కాదు రాజ్యంలో జరిగే విషయాలపై నిరసన తెలుపుకోవచ్చు. ఐతే ఈ హక్కులని కూల్చేందుకు బీహార్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. వివరాల్లోకి వెళితే బీహార్ పోలీసులు ఒక సర్క్యులర్ జారీ చేసారు.
దాని ప్రకారం నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారట. ధర్నాలు చేయడం, బంద్ ప్రకటించడం మొదలైన నిరసన తెలిపే కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగాలకి పనికిరారట. ఇలాంటి వారికి ప్రభుత్వ కాంట్రాక్టులూ దక్కవట. దీంతో బీహార్ లోని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. పౌరుల హక్కులని హరింపజేసే నిర్ణయాలు రాజ్యాంగ ఉల్లంఘనకి దారితీస్తున్నాయని అంటున్నారు. మరి దీనిపై బీహార్ పోలీసులు ఏం సమాధానం చెబుతారో!