పావ్ భాజీ ఎలా వచ్చిందో తెలుసా..?

-

పావ్ భాజీ గురించి తెలియని వారుండరూ. నోరూరించే స్ట్రీట్ ఫుడ్స్ లలో పావ్ భాజీ కూడా ఒకటి. దేశంలో ఎక్కడికి వెళ్లిన ఈ వంటకం కనిపిస్తుంది. అంతలా ఆదరణ పెరిగింది ఈ స్ట్రీట్ ఫుడ్ కి. పావ్ భాజీ ఎక్కువగా ముంబైలో ఫేమస్. ముంబై ప్రజలు పావ్ భాజీ తినకుండా ఉండరంటే అర్థం చేసుకోండి.. ఈ వంటకానికి ఉన్నంత క్రేజ్ ఏంటో. నిజానికి ఈ వంటకం పుట్టింది ముంబైలోనే. అమెరికాలో ఏర్పడిన అంతర్యుద్ధం కారణంగా.. పావ్ భాజీ వంటకం తయారైంది. అమెరికా అంతర్యుద్ధానికి.. పావ్ భాజీకి సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే పావ్ భాజీ ఎలా తయారైందనే విషయాన్ని తెలుసుకుందాం..

paav bhaaji
paav bhaaji

1860 సంవత్సరంలో అమెరికాలో అంతర్యుద్ధం ఏర్పడింది. అప్పుడు అమెరికా వ్యాప్తంగా పత్తి సరఫరా నిలిచిపోయి సంక్షోభం ఏర్పడింది. దీంతో అమెరికా పత్తి దిగుమతి చేసుకోవడానికి వివిధ దేశాలను అన్వేషించింది. భారత్ లోని ముంబై నగరంలో పత్తి మిల్లులు ఎక్కువగా ఉండటం, ఎగుమతులు చేయడానికి అనుకూలంగా ఉండటంతో పత్తి డీలర్లతో అమెరికా సంప్రదింపులు నిర్వహించింది. అమెరికా నుంచి ఆర్డర్లు పెరగడంతో ముంబైలోని పత్తి మిల్లులకు పనులు పెరిగాయి.

ఆర్డర్ లు పెరగడంతో కార్మికులను పని పెరిగింది. వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కార్మికులు రాత్రంతా పని చేసే వాళ్లు. దీంతో రాత్రి పూట మధ్యలో ఆకలి వేసేది. అప్పుడు కార్మికులకు తినడానికి ఆహారం లేకుండా పోయేది. దీంతో ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుని ఉండేవాళ్లు. అది గమనించిన ఓ చిరుతిండ్ల వ్యాపారికి ఓ ఆలోచన తట్టింది. మార్కెట్ లో విక్రయించగా మిగిలిన కూరగాయలు, టమాట, బంగాళదుంపలను తీసుకొచ్చి అన్నింటిని కూరలా వండేవాడు. బ్రెడ్ ను వెన్నలో వేయించి ఆ కూరతో కలిపి విక్రయించడం మొదలు పెట్టాడు. ఆ కార్మికులు బ్రెడ్ ముక్కల్ని కూరలో అద్దుకుని తినడంతో కొత్త రుచితో పాటు కడుపు నిండేది. తక్కువ ధరతో, తక్కువ సమయంలో తయారయ్యే పావ్ భాజీతో కార్మికుల కడుపు నిండేది.

ఆమెరికా నుంచి ఆర్డర్ల సంఖ్య పెరగడం మొదలైంది. కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో పావ్ భాజీకి ఆదరణ కూడా పెరిగింది. మెల్లమెల్లగా పావ్ భాజీ ముంబై మొత్తం వ్యాపించింది. కార్మికుల నుంచి సాధారణ ప్రజల వరకు తినడం మొదలు పెట్టారు. బిజినెస్ డెవలప్ మెంట్ అవుతుందని ముంబైతోపాటు దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పావ్ భాజీ తయారు చేయడం ప్రారంభించారు. దీంతో ఈ స్ట్రీట్ ఫుడ్ కి క్రేజ్ పెరిగింది.

అయితే పావ్ భాజీకి ఈ పేరెలా పెట్టారని చాలా మందికి సందేహం రావొచ్చు. పావ్ భాజీలో పావ్ అంటే బ్రెడ్ అని, భాజీ అంటే మరాఠీలో కూరగాయలు అని అర్థం. బ్రెడ్ లో కూరగాయలు వేసుకుని తింటాం కాబట్టి దీనికి పావ్ భాజీ అని పేరు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news