అయ్యో పాపం..ఈ దొంగకు ఎన్ని కష్టాలో..

-

చిక్కకుండా దొంగతనం చెయ్యడం కోసం దొంగలు ఎన్నో కష్టాలు పడాలి.కొన్నిసార్లు పోలీసులకు చిక్కితే ఇక అంతే..ఎంత పెద్ద గజ దొంగ అయిన కూడా ఏదోక సమయంలో దొరకడం జరుగుతుంది.ఇంటి ముందు పార్క్‌ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు.

తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు..సెప్టెంబర్‌ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్‌ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు.

రైలు సాహెబ్‌పూర్‌ కమల్‌ స్టేషన్‌ దగ్గరకు రాగానే దొంగ మొబైల్‌ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్‌ బెడిసి కొట్టింది. మొబైల్‌ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్‌ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు.కానీ వాళ్ళు వదలలేదు.

రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్‌ చేయి వదలడంతో అతడు పారిపోయాడు.అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.. రకరకాల కామెంట్ల తో వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news