పుట్టిన రోజు వేడుకల్లో అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐ పై ఎట్టకేలకు వేటు పడింది. పక్కా ఆధారాలతో ఆ సీఐపై సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి.
ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావటంతో రేవ్‌పార్టీ జరిగిదంట. అయితే.. ఈ ఘటనలో ఇవాళ సీఐపై వేటు పడింది.