అమర రాజా ఫ్యాక్టరీని మేం వెళ్లగొట్టలేదు : సజ్జల

-

తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి…. అమర రాజా ఫ్యాక్టరీపై స్పందించారు. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేము చెప్పలేదని… హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని వారు ఇక్కడే కొనసాగవచ్చని తెలిపారు.

పరిశ్రమలు తరలిపోవాలని మేము కోరుకోమని.. రాష్ట్రంలో 66 ఫ్యాక్టరీలకు అధికారులు మూత నోటీసులు ఇచ్చారు… అందులో 40 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని వెల్లడించారు సజ్జల..ప్రమాదకర లెడ్ తో నీళ్ళు కలుషితం చేస్తూ ఉన్నా చూస్తూ ఊరుకోరు కదా? అని ప్రశ్నించారు సజ్జల. నిబంధనల ప్రకారం నడపకపోతే ఇక్కడ ఉండలేరు అని మాత్రమే అమర రాజా కు చెప్పామన్నారు. ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో పెట్టినా ఈ సమస్యలు అక్కడి వాళ్లు కూడా అడుగుతారని… ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగుల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఆయన తెలిపారు. జగన్‌ ప్రభుత్వం ఎప్పుడు ఏపీ ప్రజల కోసమే పని చేస్తుందని తెలిపారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news