బిగ్‌బాస్‌ 4 లో బిత్తిరి సత్తి..?

-

వీ6 తెలుగు న్యూస్ ఛాన‌ల్‌లో తీన్మార్ వార్త‌ల్లో బిత్తిరి స‌త్తిగా మ‌న‌కు ప‌రిచ‌య‌మైన చేవెళ్ల ర‌వి ఇటీవ‌లి వ‌ర‌కు టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌లో ప‌నిచేశార‌న్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక్క‌సారిగా టీవీ9కు రాజీనామా లేఖ ఇచ్చారు. త‌న‌కు తానుగా రాజీనామా చేశాడా లేక యాజ‌మాన్యం ఒత్తిడి మేర‌కు చేశాడా అన్న‌ది తెలియ‌రాలేదు. . కానీ తాజాగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం.. స‌త్తి త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 4 షో లో స‌త్తికి అవకాశం వ‌చ్చిందంటూ ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తుంది. .

bithiri sathi may contest in bigg boss telugu season 4 show

గ‌తంలో టీవీ9లో ప‌నిచేసిన దీప్తి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఆ త‌రువాత ఆమె య‌థావిధిగా టీవీ కార్య‌క్ర‌మాల్లో మ‌ళ్లీ బిజీ అయింది. అయితే ఇప్పుడు స‌త్తి కూడా ఇలాగే బిగ్ బాస్ షో కోసం రాజీనామా చేశార‌ని తెలుస్తోంది. అందుక‌నే ఆయ‌న టీవీ9కు రాజీనామా చేశార‌ని స‌మాచారం. త్వ‌ర‌లో బిగ్‌బాస్ షో 4వ సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అందులో పాల్గొన‌డం కోసం ముందుగానే స‌త్తి రాజీనామా చేసి ఉంటార‌ని గుస‌లు గుస‌లు వినవ‌స్తుపన్నాయి..

అయితే బిగ్‌బాస్ షోలో పాల్గొనాలంటే.. నిజానికి రాజీనామా చేయాల్సిన ప‌నిలేదు. షో కొద్ది రోజులే ఉంటుంది క‌నుక సంస్థ‌తో మాట్లాడి అన్ని రోజులు దూరంగా ఉంటాన‌ని ముందే ప‌ర్మిష‌న్ తీసుకోవ‌చ్చు. షో ముగిశాక మ‌ళ్లీ టీవీ కార్య‌క్ర‌మాల్లో య‌థావిధిగా పాల్గొన‌వ‌చ్చు. కానీ స‌త్తికి, టీవీ9కు మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం చాలా క‌ఠిన నిబంధ‌న‌లతో ఉండి ఉండ‌వ‌చ్చు. క‌నుక‌నే ఆయ‌నకు షోలో పాల్గొనేందుకు టీవీ9 అనుమ‌తి ల‌భించ‌క‌పోయి ఉండ‌వ‌చ్చు. అందువ‌ల్లే ఆయ‌న వేరే దారి లేక.. షోలో పాల్గొనేందుకు టీవీ9కు రాజీనామా ఇచ్చిన‌ట్లు స‌న్నిహితుల ద్వారా తెలుస్తున్న స‌మాచారం..

Read more RELATED
Recommended to you

Latest news